విశాఖ

పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.రాయవరం, ఫిబ్రవరి 10: మండలంలోని రేవుపోలవరం గ్రామంలో మాఘపౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. భక్తులతో సముద్రతీరం నిండిపోయింది. మాఘపౌర్ణమి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామునుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రేవుపోలవరం పరిసర గ్రామాల నుండి కోలాటాలు, భజనలతో వచ్చిన బృందాలు గురువారం రాత్రి జాగరణోత్సవం నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపై వేంచేసియున్న లక్ష్మీమాధవ స్వామిని దర్శించుకుని కానుకలు సమర్పించారు. జాతర కోసం నర్సీపట్నం, కోటవురట్ల, పాయకరావుపేట, యలమంచిలి, నక్కపల్లి, ఎస్. రాయవరం ప్రాంతాల నుండి తరలివచ్చిన సుమారు లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అడ్డురోడ్డు నుండి రేవుపోలవరం వరకు పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. సముద్రతీరంలో సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు పాలు అందజేయడంతోపాటు మహిళల కోసం తాత్కాలిక మరుగు వసతిని ఏర్పాటు చేశారు.పెనుగొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వెంకట కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సముద్రతీరంలోనే గజ ఈతగాళ్లను సిద్ధం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తును నర్సీపట్నం ఎఎస్పి ఐశ్వర్య రస్తోగి స్వయంగా పర్యవేక్షించారు. అడ్డురోడ్డు నుండి ప్రైవేట్ వాహనాలను అనుమతించకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడలేదు. నక్కపల్లి సిఐ రాంబాబుతోపాటు ఎస్. రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షించారు. స్థానిక ఎంపీపి వై. వినోద్‌రాజు, తహశీల్దార్ జి. సన్యాశిరాజు, ఎంపీడివో డిడి స్వరూపారాణిలు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.