విశాఖపట్నం

సమసమాజ స్థాపనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: అసమానతలు లేని సమసమాజ స్థాపనే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతిని పురస్కరించుకుని ఎయు కాన్వొకేషన్ హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసానిచ్చారు. బిసి విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు నుంచి వారి విదేశీ చదువులకు సైతం ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే చేతి వృత్తి పనివారలను ఆదుకోవడంతో పాటు వారికి ఆధునిక పనిముట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే బసి ఫెడరేషన్లను బలోపేతం చేసి, వారిని ఆర్థికంగా ఆదుకుంటామని హామీనిచ్చారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంస్కరణ కర్తగా పూలే వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు నిరుపమానమని అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లోను గణనీయమైన అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగానే బాలికలు చదువులో రాణించాలని, భేటీ బచావ్,్భటీ పడావ్ నినాదంతో కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జనధన్ యోజన పథకం, ముద్రా రుణాలు, ఇంకా పలు కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. రైతులు క్షేమంగా ఉంటేనే, దేశం సుభిక్షంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రధాని వ్యవసాయ బీమా యోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియం చెల్లించి, పంట రక్షణ పొందే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సాంఘిక అసమానతలు తొలగించే కార్యక్రమాలతోనే మహాత్మా జ్యోతిరావు పూలేకు నిజమైన నివాళులు అర్పించాలన్నారు. కేంద్రం మహిళా కార్మికులకు సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. వీరికి ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామన్నారు. అలాగే అసంఘటిత రంగంలో కార్మికులకు సైతం అన్ని సదుపాయాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది కార్మికులకు ఇఎస్‌ఐ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలందిస్తున్నట్టు తెలిపారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు ప్రాంతాల్లో 100 పడకల సామర్ధ్యం కలిగిన ఇఎస్‌ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం పోరాడిన జ్యోతిరావు పూలే తొలి మహాత్ముడని అన్నారు. వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. విశాఖ ఎంపి కె హరిబాబు మాట్లాడుతూ బాలికా అక్షరాస్యత కోసం జ్యోతిరావు పూలే ఎంతో శ్రమించారన్నారు. తన భార్య సావిత్రబా పూలేచే సొంతంగా పాఠశాల స్థాపించి, మహిళల్లో విద్యను ప్రోత్సహించారన్నారు. కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కె అచ్చెన్నాయుడు, ఎంపి కె హరిబాబు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, పిజివిఆర్ నాయుడు (గణబాబు), వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్, పి విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, పప్పల చలపతిరావు, జి శ్రీనివాసులు నాయుడు, కలెక్టర్ ఎన్ యువరాజ్, జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన నగరానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు రూ.6.59 కోట్ల బ్యాంకు లింకేజి చెక్కును అందజేశారు.
ఇరువర్గాల ఘర్షణ
20 మందికి గాయాలు * 144 సెక్షన్ అమలు
ఎమ్మెల్యే, ఎస్పీ, ఆర్డీఓ చర్చలు
పాయకరావుపేట, ఏప్రిల్ 11: వివాహేతర సంబంధం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం కాలనీల్లో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాలకు చెందిన వారు రాళ్లతో, కర్రలతో, కత్తులతో దాడులు జరపడంతో సుమారు 20మంది స్వల్పగాయాల పాలయ్యా రు. గాయపడ్డవారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. దళితుల్లో ఒక వర్గానికి చెందిన వ్యక్తి, వేరే వర్గానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై గత మూడు రోజులుగా ఇరు వర్గాలకు (మిగతా 2వ పేజీలో)

చెందిన వారు గొడవలు పడుతూ ఉన్నారు. సోమవారం వీరి ఆగ్ర హం కట్టలు తెచ్చుకుంది. ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మగవారు ఇంట్లో లేని సమయం చూసి ఇళ్లపై దాడులు చేశారు. ఇంట్లో ఉన్న సామాన్లు బయటకు విసిరి వేయడంతోపాటు, చిన్న,పెద్ద వయస్సుతో తేడా లేకుండా కర్రలతో, కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఇళ్లపైకి పెద్దపెద్ద రాళ్లు విసిరివేశారు. దాడులు జరినపుడు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు దక్కించుకున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. కాలనీల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా 144 సెక్షన్ అమలులో చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను బందోబస్తు ఉంచారు. ఈ విషయమై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇరువర్గాలతో వేర్వేరుగా సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. ఒకరిపై మరొక వర్గంకు చెందిన వారు దాడులు చేసుకోవడం సరికాదని తెలిపారు. బీభత్సంగా కనిపిస్తున్న కాలనీలను పరిశీలించారు. అనంతరం ఇరువర్గాలకు చెందిన పెద్దలతో ఎమ్మెల్యే వంగలపూడి అనిత, నర్సీపట్నం ఆర్డీఓ సూర్యారావు చర్చలు జరిపారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలు వారి వర్గాలకు చెందిన వారిని గొడవలు జరగకుండా నచ్చచెప్పుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ కోయా ప్రవీణ్, నర్సీపట్నం ఎఎస్పీ రస్తోగి ఇరువర్గాలకు చెందిన పెద్దలతో పోలీస్‌స్టేషన్‌లో చర్చలు జరిపారు. దాడులు పునరావృతం కాకుండా పెద్దలు వారి వారి వర్గాలతో చర్చలు జరపాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్కడ ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.