విశాఖపట్నం

66 వేల మందికి ‘సురక్ష’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, ఫిబ్రవరి 10: జిల్లా వ్యాప్తంగా గత ఏడాది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 66 వేల మంది బాలింతలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జననీ సురక్ష యోజన పథకంలో సహాయం అందజేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సరోజిని వెల్లడించారు. శుక్రవారం మండలంలోని టెక్కలిపాలెంలో 1-19 ఏళ్ళ వయస్సుగల వారికి నులిపురుగుల మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు రాష్ట్ర చైల్డ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ వాణిశ్రీ తోకలిసి వచ్చిన ఆమె ఇక్కడి విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన చంద్రన్న సంచార వైద్యసేవలు, గర్భిణుల కోసం అమలు చేస్తున్న తల్లీబిడ్డల ఎక్స్‌పెస్ సేవలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు జిల్లాలో అన్ని మండలాల్లో పర్యటిస్తున్నామన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మొత్తం 4,174 పాఠశాలలు ఉండగా అందులో 3,64,269 మంది విద్యార్థులకు, జిల్లాలోని 4,952 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 2,52,533 మంది బాలలకు నులిపురుగుల మాత్రలను పంపిణీ చేసినట్టు తెలిపారు.జిల్లాలో ప్రస్తుతం 840 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్ర చైల్డ్ హెల్త్ సంయుక్త సంచాలకులు డాక్టర్ వాణిశ్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.