విశాఖపట్నం

అధికారులతో చంద్రబాబు చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రాయూనివర్శిటీలో సోమవారం జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతి కార్యక్రమం అనంతరం ఆయన ఎయులోనే అధికారిక చర్చలో పాల్గొన్నారు. అరకులో స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు హామీని గతంలో ఇచ్చామని, ప్రస్తుతం స్కూల్ ఏర్పాటుపై ప్రకటన చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సిఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అరకు ప్రాంతాన్ని తాను దత్తత తీసుకున్నానని, ఇచ్చిన హామీ మేరకు స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదన బాధ్యతను మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావులకు అప్పగించినట్టు సమాచారం. ఇక ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యాల పాలుకావటం, కొన్ని సందర్భాల్లో మరణాలు చోటుచేసుకోవడంపై సిఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. విద్యార్థుల మణాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగా విమ్స్‌లో ఒపి సేవలను ప్రారంభించామని, అయితే విమ్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలందించే విధంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డైరెక్టర్ డాక్టర్ సుధాకర్‌కు సూచించారు. విశాఖ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటు కానున్న తరుణంలో సబ్బవరం ప్రాంతాన్ని విద్యా హబ్ గా తీర్చిదిద్దాలని సూచించారు. ఇదే సందర్భంలో స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారులతో సమీక్షించిన సిఎం చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. విశాఖలో క్రీడాభివృద్ధికి సంబంధించి స్టీల్‌ప్లాంట్ అందిస్తున్న సహకారంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల పిల్లల కోసమైనా క్రీడాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. అలాగే విశాఖలో జాతీయ క్రీడలను నిర్వహించాలని యోచిస్తున్న నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ ఎంతవరకూ సహకరిస్తుందని ప్రశ్నించినట్టు తెలిసింది. సమీక్షలో మంత్రులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, ఎంపి కె హరిబాబు, కలెక్టర్ ఎన్ యువరాజ్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, పల్లా శ్రీనివాస్, జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.