విశాఖపట్నం

సమయంలేదు ‘మిత్రమా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. పోలింగ్‌కు కేవలం 22 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. మూడు జిల్లాలు..34 మంది ఎమ్మెల్యేలు.. లక్షా 56వేల మంది ఓటర్లు.. వీరందరిని కలుసుకోవాలి. మంతనాలు జరపాలి.. గెలవడానికి వ్యూహాలు రచించుకోవాలి.. మిత్రపక్షాల సహకారం తీసుకోవాలి.. ఇవన్నీ 22 రోజుల్లో సాధ్యమా? ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గాన్ని బిజెపికి వదిలేసినట్టు టిడిపి నాయకులు పరోక్షంగా ప్రకటించారు. బిజెపి నాయకులకు కూడా ఈ విషయంలో స్పష్టత లేదు. సీటు తమకే ఖరారైందా? లేదా? అభ్యర్థి ఎవరు? అన్న మీమాంశ బిజెపి నాయకులను వెంటాడుతునే ఉంది. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టిడిపిలో అభ్యర్థులు లేరట! ఉన్న ఆ కొద్దిమందిలో ఎవ్వరూ అథినేతకు నచ్చలేదట! అందుకే సీటును బిజెపికి వదిలేయాలని నిర్ణయించుకున్నారట! ఇది అధికార పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. కానీ అదే పార్టీలోని సీనియర్ నాయకులు ఆదివారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఈ నియోజకవర్గంపై సీటు ఎవరికన్నది ఇంకా ప్రకటించాలి కదా! అని అన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమయం లేకపోవడం బిజెపికి ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు గత మూడు రోజులుగా మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనడం వలన ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించలేకపోతున్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల సీటును బిజెపికి కాకుండా, టిడిపిలో మరెవరికైనా ఇస్తారా? అన్న అనుమానాలు కొత్తగా తలెత్తుతున్నాయి. టిడిపి నుంచి కాశీవిశ్వనాథ్ ఇప్పటికీ రేసులోనే ఉన్నారు. మంత్రి గంటా ఆశీస్సులతో ఆయన టిక్కెట్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు బిజెపికి ఖరారైందని తేలడం, అభ్యర్థిగా మాధవ్ పేరును ఖరారు చేసినట్టు అధిష్ఠానం నుంచి పరోక్ష సమాచారం అందడంతో మాధవ్ ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థిత్వంపై మీమాంశ ఉన్నప్పటికీ, తన అభ్యర్థిత్వం ఖరారైనా, కాకపోయినా, బరిలోకి దిగారు కాబట్టి, ముందుకు వెళ్లాలని మాధవ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోపక్క ఈ సీటును తమకే ఇస్తామని చెప్పిన టిడిపి ఇప్పటి వరకూ దానిపై ఒక ప్రకటన చేయకపోవడం శల్యసారథ్యాన్ని తలపిస్తోందని బిజెపి వర్గాలు అంటున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన చేసినా, ఆ పార్టీ మద్దతుపై కూడా బిజెపి వర్గాలు అనామానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అర్బన్, విశాఖ రూరల్ జిల్లాలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరగబోతోంది. సమావేశ సమయానికి టిడిపి నుంచి అధికార ప్రకటన రాకపోతే, ఎన్నికల్లోకి ఏవిధంగా వెళ్లాలన్న అశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీ టిక్కెట్ రేసులో ఉన్న వారిలో ఎవరినో ఒకరిని అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.