విశాఖపట్నం

వ్యర్థాల నుండి సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: వ్యర్థాల నుంచి సంపద సృష్టించునేందుకు స్థానిక సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఘన వ్యర్థాల నిర్వహణపై పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ పారిశుద్ధ్య పనులకు విశేష ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో తడి,పొడి చెత్త సేకరణ చేపట్టాలని, వీటి నుంచి కంపోస్టును ఉత్పత్తి చేయడం ద్వారా సంపదను సృష్టించుకోవాలని సూచించారు. ఈ పథకానికి నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తడి,పొడి చెత్త సేకరణ ద్వారా వర్మీ కంపోస్టును ఉత్పత్తి చేస్తున్నారన్నారు. దీనికోసం ప్రధాన కేంద్రాల్లో 20 నుంచి 30 శెంట్లు, చిన్న గ్రామాల్లో 10 శెంట్లు స్థలాను గుర్తించాలని అధికారులకు సూచించారు. దీనికి సంబందించి ప్రతిపాదలు పంపితే తక్షణమే ఆమోదించగలమన్నారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని పక్షంలో తనకు ప్రతిపాదిస్తే ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. తొలి దశలో మండలానికి ఐదు పంచాయతీలను గుర్తించి, వర్మీ కంపోస్టు ఉత్పత్తిని సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సర్పంచ్‌లను భాగస్వామ్యం చేసుకుంటూ చెత్త నుంచి సంపద సృష్టించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముందుకు రాని పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఇఓ ఆర్డీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాల పనితీరును తాను ప్రతి వారం సమీక్షిస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ జి సృజన, సహాయ కలెక్టర్ సాయికాంత్ వర్మ, జెడ్పీ సిఇఓ జయప్రకాష్ నారాయణ, డ్వామా పిడి కల్యాణ చక్రవర్తి, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ కోఆర్డినేటర్ నాగలక్ష్మి, విశాఖ, నర్సీపట్నం, అనకాపల్లి ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, సూర్యారావు, పద్మావతి, డిపిఓ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.
పర్యాటకానికి విశేష అవకాశాలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: పర్యాటక రంగానికి విశాఖలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఎ హిడెన్ పారడైజ్ ఆఫ్ ఈస్ట్ పేరిట ఈనెల 24,25 తేదీల్లో విశాఖలో జరగనున్న సిఐఐ పర్యాక సదస్సుకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే, జిల్లా జిడిపి గ్రోత్ పెరుగుతుందని అన్నారు. టూరిజం మని జీవితంలో భాగమైపోయిందని అన్నారు. రెండున్నరేళ్ల కిందటి వరకూ ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని పెద్దగా పట్టించుకోలేదని, చంద్రబాబు సిఎం అయ్యాక, విశాఖను పర్యాటక రంగంలో తీర్చిదిద్ది, ప్రపంచ పర్యాటక పటంలో నిలపాలని చూస్తున్నారని అన్నారు. పర్యాటకరంగానికి కావల్సిన వౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. విశాఖకు అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నారని, వారిని ఆకర్షించేందుకు పలు ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయవచ్చని ఆయన చెప్పారు. 24, 25 తేదీల్లో విశాఖలో జరిగే సదస్సుకు రాజస్థాన్, ఉదయపూర్ నుంచి పర్యాటక రంగంలోని లోటుపాట్లు తెలిసిన డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ కమిటీ ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. విశాఖలో ఇప్పటి వరకూ మనం చూపించలేకపోయిన పర్యాటక స్థలాలను వారికి చూపించి, వాటి అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకుంటామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐఐ ఎపి చైర్మన్ జిఎస్ శివకుమార్, సిఐఐ ఎపి టూరిజం ప్యానల్ మెంబర్‌లు అదిత్య మల్ల, అజిత్ గార్చ, టూరిజం ప్యానల్ కన్వీనర్ నీరజ్ శారద, కో-కన్వీనర్ పివి నరసింహారావు పాల్గొన్నారు.
‘జిల్లాలో ఫైలేరియా వ్యాధి
సంక్రమణ అంచనాపై సర్వే నిర్వహిస్తాం’

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: జిల్లాలో ఫైలేరియా వ్యాధి సంక్రమణ అంచనా సర్వే నిర్వహిస్తామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె.సరోజిని అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఒకటి, రెండు తరగతులు చదువుతున్న ఆరు, ఏడు ఏళ్ళ బాల, బాలికలకు పాఠశాలల్లోనే ఫైలేరియా రక్తపరీక్షలు చేస్తామన్నారు. ఏటా జిల్లావ్యాప్తంగా ఫైలేరియా నివారణ మందులు అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది మాత్రం జిల్లాలో సర్వే తలపెట్టామన్నారు. అన్ని ప్రభుత్వ, జెడ్‌పి, మునిసిపల్, ప్రైవేటు పాఠశాలల్లో సర్వే ఎలా చేయాలో సోదాహరణంగా వివరించారు. అలాగే సర్వేకి సంబంధించి సూచనలు, సలహాలు అందజేశారు. జిల్లా మలేరియా నివారణ అధికారి కెవిఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఆర్.రమేష్, జోనల్ మలేరియా ఆఫీసర్ లక్ష్మి, జోనల్ మలేరియా అసిస్టెంట్ డైరెక్టన్ బిఎల్‌ఎన్ కుమార్, ఫైలేరియా విభాగం కన్సల్టెంట్ లక్ష్మణ్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.