విశాఖ

ఆగని శిశు మరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, ఫిబ్రవరి 16: విశాఖ మన్యంలో మాతా శిశు మరణాలను నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మరణాల పరంపర ఆగడం లేదు. ఏజెన్సీలో నిత్యం ఎక్కడో చోట మాతా శిశు మరణాలు జరుగుతూనే ఉం టుండగా జి.మాడుగుల మండలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా మారింది. మండలంలో ఇటీవలనే ఒక శిశువు మృత్యువాతకు గురికాగ గురువారం మరో శిశువు మరణించింది. జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ గొడ్డుబూసుల గ్రామానికి చెందిన కుమ్మరి అప్పలనాయుడు, గణపతమ్మ దంపతులకు ఈ నెల 14న జన్మించిన మగ శిశువు మూడు రోజుల వ్యవధిలోనే గురువారం ఉదయం మృతి చెందింది. స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సాయంత్రం జన్మించిన ఈ శిశువును వైద్యులు పరీక్షించి ఆరోగ్యం బాగానే ఉండడంతో వారి ఇంటికి పంపించారు. తల్లిదండ్రులు శిశువును ఇంటికి తీసుకువెళ్లగా గురువారం ఉదయం ఆకస్మికంగా ఈ శిశువు మృతి చెందింది. శిశువు మృతికి కారణాలు మాత్రం తెలియరావడం లేదు. స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 11వ తేదిన జన్మించిన మగ శిశువు పుట్టిన రెండు గంటల వ్యవధిలోనే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ శిశువు మృతి చెందిన ఐదు రోజులలోనే మరో శిశువు మృత్యువాతకు గురయ్యింది. అదేవిధంగా జి.మాడుగుల మండలం లువ్వాసింగి పంచాయతీ పినజాగేరు గ్రామానికి చెందిన పొత్తూరు చంద్రమ్మ అనే బాలింత ఈ నెల 13వ తేదిన మృతి చెందింది. ఇంటి వద్దనే ప్రసవం చేసుకున్న ఈ బాలింతకు సరైన వైద్య సేవలు అందకపోవడంతో మృతి చెందింది. మండలంలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు శిశువులు, బాలింత మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

ఉపాధి పనులు ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలన
గిరిజనులకు వస్తున్న ఆదాయం ఎంత?
కూలీ చెల్లింపులు ఎలా ఇస్తున్నారు?
మరుగుదొడ్ల నిర్మాణం పనులు ఎంతవరకు వచ్చాయి? వంటి వాటిపై ఆరా

పాడేరు, ఫిబ్రవరి 16: విశాఖ గిరిజన ప్రాంతంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు బృందం గురువారం పరిశీలించింది. ప్రపంచబ్యాంకుకు చెందిన బృం దం సభ్యులు వసుంధర, రాజారాణి, కీర్తిమిశ్రా, బాలక్రిష్ణ, పద్మ, చేకూరి శ్రీనివాస్ రెండు బృందాలుగా ఏర్పాడి పాడేరు, జి.మాడుగుల మండలాల్లోని పలు గ్రామాలలో పర్యటించారు. పాడేరు మండలం మోదాపల్లి, కొత్తపల్లి, జి.మాడుగుల మండలం గొందిపాడు, కులుపాడు గ్రామాలలో వీరు పర్యటించి ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరు తెన్నులను గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పథకంలో పనులు చేస్తున్న గిరిజనుల కు వస్తున్న ఆదాయం, కూలీ చెల్లింపులు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి వాటిపై వారు ఆరా తీశారు. జి.మాడుగుల మండలం కులుపాడు గ్రామంలో నిర్మించిన పాలీ హౌస్, డైరీ యునిట్‌లను, గొందిపాడు గ్రామంలో తాగునీటి పథకాన్ని వారు పరిశీలించారు. పాడేరు మండలం కొత్తపల్లి గ్రామంలో గిరిజనులు పసుపు ఉడికించేందుకు వినియోగిస్తున్న యంత్రాలను వారు ఆశక్తిగా తిలకించారు. అనంతరం స్థాని క ఐటిడిఎ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి పి రవిసుభాష్‌ను ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు కలిసి గిరిజన గ్రామాలలో తమ పర్యటన వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులకు చెల్లింపులు, మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిని ప్రాజెక్టు అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీలోని 168 పంచాయతీలలో 62 వేల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించామని ప్రాజెక్టు అధికారి వారికి వివరించారు.గిరిజన గ్రామాలలో సురక్షిత నీరు అందుబాటులో ఉన్న చోట గ్రావిటీ నీటి పథకాలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. ఏజెన్సీలో 3జి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, న్యూట్రి గార్డెన్ పెంపకాలు చేపట్టి గిరిజనులకు పోషకాహారం అందేలా చూడాలని ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు ప్రాజెక్టు అధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎపిడి సుబ్బారావు, ఉపాధి హామీ పథకం ఎపిడి లచ్చన్న, పశు సంవర్థక శాఖ ఎడి కిషోర్, కాఫీ ఎడి రాధాకృష్ణ, ప్రాజెక్టు ఉధ్యానవన అధికారి ప్రభాకరరావు, ప్రాజెక్టు వ్యవసాయ అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.