విశాఖ

20న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సిఎం సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 17: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో వచ్చే నెల జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, త్వరలో నిర్వహించనున్న జివిఎంసి ఎన్నికలపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించే అవకాశం ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల సమావేశంలో పార్టీ నేతల తీరుపై ఒకింత అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు తాజాగా, జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేకించి సమీక్షించాలనుకోవడం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు కొనసాగుతున్నాయి. పరోక్షంగా ఒకరిపై ఒకరు తరచు విమర్శల దాడి చేసుకుంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న విశాఖ ఉత్సవాల నిర్వహణపై సీనియర్ మంత్రి అయ్యన్న బాహాటంగానే మండిపడ్డారు. రూ.3 కోట్లు ఖర్చు పెట్టి ఉత్సవాలు నిర్వహించేందుకు చూపుతున్న ఆతృత, పశువుల కోసం వెచ్చిస్తే రైతులు సంతోషిస్తారంటూ విమర్శించారు. దీంతో విశాఖ ఉత్సవ్‌ను అయ్యన్న వర్గీయులుగా ముద్రపడిన ఎమ్మెల్యేలు బహిష్కరించడం కూడా జరిగింది. ఇక విశాఖ నగరం, శివారు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న భూ దందాలు, సెటిల్‌మెంట్లను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అయితే సీనియర్ మంత్రి అయ్యన్న విమర్శలపై గంటా మాత్రం ఆచితూచి స్పందించారు. జిల్లాలో మంత్రుల మధ్య విబేధాలతో ఎమ్మెల్యేలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. మరికొంతమంది తటస్థంగా ఉండిపోయారు. ఇక జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై కూడా పలు ఆరోపణలు వెల్లువెత్తడం అధినేతకు ఆగ్రహం రప్పిస్తోంది. మంత్రి గంటా నియోజకవర్గంలో ఒక వర్గం ప్రభుత్వ భూములను కొనుగోలు చేస్తోందని, దీని ప్రభావం ప్రభుత్వంపై పడుతోందన్న ఆరోపణలున్నాయి. పెందుర్తి మండలం ముదపాకలో డిఫారం పట్టా భూముల కొనుగోలులో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల పాత్రపై లోగడ తీవ్ర విమర్శలే వెల్లువెత్తాయి. మిత్రపక్ష ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దీనిపై ఘాటుగానే స్పందించడంతో పాటు బాధిత రైతులతో కలిసి కలెక్టర్‌కు, వుడా ఉపాధ్యక్షునికి ఫిర్యాదు చేయించారు. ఈ విషయంపై కూడా అప్పట్లో సిఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన ఎమ్మెల్సీ స్థానాన్ని మిత్రపక్షం బిజెపికి కేటాయించారు. ఉమ్మడి అభ్యర్థి విజ యం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని సూచించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం జివిఎంసికి ఎన్నికలు నిర్వహించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.