విశాఖ

ఉత్తరాంధ్ర సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 18: ఉత్తరాంధ్ర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాలతో ప్రజలను చైతన్య పరిచేందుకు సిద్ధమని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. లోక్‌సత్తా ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శనివారం వౌనదీక్ష చేపట్టారు. అంతకు ముందు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, దీక్షకు ఉపక్రమించే ముం దు బాబ్జీ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుక బడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారం చేపట్టిన తరువాత ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ప్రకటించారని గుర్తు చేశారు. శ్రీకాకుళానికి 12 అంశాలు, విజయనగరానికి 10 అంశాలు, విశాఖకు 13 అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారన్నారు. మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ అంశాలపై స్పందించేలేదని ఆరోపించారు. మూడు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు వాటిని విస్మరించడం తగదన్నారు. ముఖ్యమంత్రి దృష్టంతా రాజధాని అమరావతిపైనే కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు. తీవ్ర వర్షాభావంతో వ్యవసాయం సాగక, పనులు దొరక్క, ఉపాధి లభించక వలసలు పోతున్నారని, పరిశ్రమలు మూతపడటంతో ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై లోక్‌సత్తా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజలను జాగృతం చేసేందుకు లోక్‌సత్తా పనిచేస్తుందన్నారు. లోక్‌సత్తా వౌన దీక్షకు మాజీ ప్రజా ప్రతినిధులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, సిపిఎం, సిపిఐ నాయకులు గంగారావు, ఎజె స్టాలిన్ తదితరులు సంఘీభావం తెలిపారు.