విశాఖపట్నం

విమ్స్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: విమ్స్ సేవలు ప్రారంభమయ్యాయి. దీనిని సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రూ.115 కోట్లతో నిర్మించిన విమ్స్ ఆసుపత్రిలో పలు విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా కొంతమంది రోగులకు చికిత్స ప్రారంభించారు. ఆయా విభాగాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ఆరోగ్యశ్చా మంత్రి కామినేని శ్రీనివాస్ పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడారు. ఉచిత వైద్యాన్ని సద్వినియోగపర్చుకోవాల్సిందిగా సూచించారు. అత్యంత అధునాతన వైద్య పరికరాలు, ఆయా విభాగాల ద్వారా అందించే సేవల గురించి సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇళ్ళకు క్షేమంగా పంపండి :
కేంద్ర మంత్రి
రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించి తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరినట్టు చేయాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వైద్యులకు సూచించారు. తొలి దశలో ఏయే వైద్య విభాగాలు అందుబాటులో ఉంటాయి? ఇందులో వైద్యులు, సిబ్బంది పరిస్థితి ఏమిటి? రోగులకు ఏ విధమైన సేవలందుతాయి? అనే అంశాలను వైద్యాధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అయిన తరువాత పలు విభాగాలకు సంబంధించి చికిత్స కోసం చేరిన కొంతమంది రోగుల వద్దకు చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మరికొన్ని విభాగాల్లో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను పరిశీలించారు. ఆసుపత్రి విభాగాలన్నింటిలో కలియ తిరిగిన వీరంతా రానున్న రోజుల్లో రోగులకు అందుబాటులో అన్ని రకాలైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పునియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాస్, వైద్య శాఖ ఉన్నతాధికారులు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రవిరాజ్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్‌బాబు తదితరులు హారరయ్యారు.