విశాఖ

ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, ఫిబ్రవరి 20: తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లే ఆలోచన ప్రస్తుతం లేదని, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక విలేఖర్లతో తాళ్లపాలెంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడులో జరిగిన జల్లికట్టు మాదిరిగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రత్యేక హోదాపై పోరాడితే రాష్ట్రానికి న్యాయం జరిగి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్‌కల్యాణ్, జగన్, వివిధ రాజకీయ పార్టీలు వేర్వేరు సమయాల్లో ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తే సుఖం లేదన్నారు. అన్నీ కలసికట్టుగా పనిచేస్తేనే హోదా సాధించేందుకు అవకాశముంటుందన్నారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్, తాళ్లపాలెం మాజీ సర్పంచ్ చిన్ని వల్లభ నారాయణరావు, ఆళ్ల రామచంద్రరావు ఉన్నారు.
రైతులను అట్టడుగు వర్గాలుగా పరిగణించాలి
జగదాంబ, ఫిబ్రవరి 20: రైతులను అట్టడుగు వర్గాలుగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఎయు విసి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఏయూ సోషల్ ఎక్స్‌క్లూజన్, ఇంక్లూజివ్ పాలసీ స్టడీస్ కేంద్రం నిర్వహించిన ఒక రోజు సదస్సు ‘సోషల్ జస్టిస్ ఫర్ మార్జినల్ కమ్యూనిటీస్’ సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతు ఆధారిత దేశంగా భారత్ నిలచేదని, నేడు పరిస్థితి దీనికి భిన్నంగా ఉందన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదన్నారు. రైతులు నేడు కూలీలుగా మారి పట్టణాలబాట పడుతున్నారన్నారు. ఇటువంటి స మయంలో రైతు ఆత్మహత్యలను నివారిస్తూ వారికి తగిన సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో వర్గాలకు ప్రాంతాలవారీగా వ్యత్యాసాల ఏర్పడతాయన్నారు. సదస్సు నిర్ణయాలు, సూచనలను ప్రభుత్వానికి పంపాల్సిన అవసరం ఉందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల సాధికారతకు కృషి జరగాలన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.గాయత్రీదేవి మాట్లాడుతూ సమాజ ఉపయుక్తంగా యువత తయారుకావాలన్నారు. సామాజిక న్యాయం అందించడానికి అంబేద్కర్ జరిపిన కృషి నేడు సత్ఫలితాలను అందిస్తోందన్నారు. కేంద్రం సంచాలకులు ఆచార్యా పి.సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సదస్సు నిర్వహణ జరుపుతున్నామన్నారు. రాజనీతి శాస్త్ర విభాగంతో సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల జీవనానికి ఉపకరించే హక్కులను అందించాలన్నారు. కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పేటేటి ప్రేమానందం, డాక్టర్ ప్రియదర్శిని వీజయ శ్రీ తదితరులు ప్రసంగించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.