విశాఖ

మన్యంలో ఎదురుకాల్పుల వదంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, ఫిబ్రవరి 23: కొయ్యూరు, గూడెం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయనే వదంతులు వ్యాపించడంతో మండల వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మండల పరిధి బూదరాళ్ళ పంచాయతీ కన్నవరం, గరిమండ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం కూబింగ్ పోలీసులకు మావోయిస్టులకు ఎదురుపడడంతో పరస్పరం కాల్పులు జరుగుతున్నట్టు పుకార్లు వ్యాపించాయి. ఈప్రాంతంలో ఇటీవల మావోయిస్టుల కదలికలు అధికమయ్యాయనే నిఘా వర్గాల సమాచారంతో అదనపు పోలీసు బలగాలు రెండు రోజులుగా రెండు మండలాల అటవీ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఆచూకీకై విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో గురువారం ఉదయం ఎదురుకాల్పులు ఘటన చోటు చేసుకుందనే వందంతులతో ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈవిషయమై కొయ్యూరు సి.ఐ మల్లికార్జునరావును వివరణ కోరగా అటవీ ప్రాంతంలో గాలింపు జరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే ఎటువంటి ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకోలేదని తేల్చి చెప్పారు.
శ్రీ అభయాంజనేయ స్వామి తీర్థం
సబ్బవరం, ఫిబ్రవరి 23: మండలంలోని ఆదిరెడ్డిపాలెంలో గురువారం శ్రీ అభయాంజనేయ స్వామి తీర్థమహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్‌ఇసిఎస్ చైర్మన్ కొటాన అప్పారావు ఇక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి పురుషుల కబడ్డీపోటీలను ఆయన ప్రారంభించారు. అభయాంజనేయ స్వామికి భక్తులు ఉదయం నుంచే పూజలు చేసి తరించారు. గ్రామ పెద్దలు ఆదిరెడ్డిపోతురాజు, కొటాన దేముడుబాబు, మడ్డుసూర్యనారాయణ, కామిరెడ్డిముత్యాలనాయుడు, బైలపూడి దేముడు, కొటాన కోటేశ్వరరావు పాల్గొన్నారు.
మాధవ్ గెలుపునకు కృషిచేయాలి

మునగపాక, ఫిబ్రవరి 23: బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఉత్తరాంధ్ర పట్ట్భద్రులు స్థానానికి పోటీచేస్తున్న పివి మాధవ్‌ను గెలిపించేందుకు కార్యకర్తలంతా శక్తి వంచనలేకుండా పనిచేయాలని యలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు స్వగృహంలో జరిగిన కార్యకర్తలు సమావేశంలో పంచకర్ల రమేష్‌బాబు ఉత్తరాంధ్ర పట్ట్భద్రులు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్ధిగా బిజెపి నాయకుడు మాధవ్‌ను ఎంపిక చేశారని, మీ మండలాల్లో పట్ట్భద్రులుగా ఉన్న విద్యావంతుల దగ్గరకు వెళ్లి ఓటు మాధవ్‌కు వేసి గెలిపించాలని ప్రతిఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేయాలని ఆయన కార్యకర్తలకు నాయకులను కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ప్రజాపతినిధులంతా మాధవ్ గెలుపుకోసం పనిచేస్తున్నామని, మీరు కూడా పూర్తిగా సహకారం అందించాలని అన్నారు. మునగపాక ఎంపిపి ఆడారి మంజు, ఎంపిటిసిలు టెక్కలి పరశురాము, దాడి జమునా, దాడి లతా శ్రీనివాసరావు, యల్లపు జగదీశ్వరీ నాగేశ్వరావు, ఉల్లింగల గోవింద్, మారిశెట్టి కనకరామలక్ష్మీ, సర్పంచ్‌లు సుందరపు వెంకటకనకఅప్పారావు, కర్రి భాస్కరావు, యల్లపు వెంకటభాస్కరావు,.కర్రి రామనాగేశ్వరావు, పాలసంఘం అధ్యక్షుడు కాండ్రేగుల నాయుడు, కె రాజశేఖర్, ఆడారి కాశీబాబు, పి ఆదినారాయణనాయుడు, శరగడం యోగినాగేశ్వరావు,బొడ్డేడ గంగాధర్ పాల్గొన్నారు.