విశాఖ

మన్యంలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, ఫిబ్రవరి 24: మన్యంలో వరుస అలజడులతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటుంది. కొయ్యూరు, గూడెం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఎదురుకాల్పులు ఘటనలో చోటు చేసుకున్నాయనే వదంతులు వ్యాపించడంతో మండల వాసులు ఉలిక్కిపడ్డారు. అయితే అవన్నీ వదంతులేనని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం ఇదే ప్రాంతంలో రెండు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడం గిరిజనులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. గత ఏడాదిలో మండల పరిధి మఠంబీమవరం, యు.చీడిపాలెం పంచాయతీ మర్రిపాకలు సమీప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు, అగ్రనేతలు సైతం హతమైన సంగతి తెలిసిందే. ఇటీవల కొద్ది కాలంగా ప్రశాంతంగా ఉన్న మన్యంలో మావోయిస్టుల కదలికలు హెచ్చుమీరుతున్నాయనే నిఘా వర్గాల సమాచారంతో పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. దీంతో గత వారం రోజులుగా మావోయిస్టుల ఆచూకీకై ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మండల పరిధిలో ఎన్‌కౌంటర్ జరుగడం గిరిజనులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది.
ఈసంఘటనతో మారుమూల ప్రాంతాల గ్రామాల గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. ఫ్రస్తుత వ్యవసాయ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌కౌంటర్ సంఘటన చోటు చేసుకోవడంతో గిరిజనులు ఇళ్ళను వీడి బయటకు వచ్చేందుకు తీవ్ర భయాందోళనలకు గురి కావడంతో మన్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
సర్వే సిబ్బంది నిర్బంధం, విడుదల
పెదబయలు: మావోల కోటలో రహదారి సర్వే కోసం వెళ్ళిన సర్వే సిబ్బందిని సాయుధ సిబ్బందిని నిర్భంచి విడిచిపెట్టినట్టు ఆలస్యంగా తెలిసింది. మండలంలోని ఇంజరి పంచాయతీకి నూతనంగా బి.టి. రహదారి నిర్మించేందుకు సర్వే సిబ్బంది ఈ నెల 21న మంగళవారం సర్వే పనులు ప్రారంభించారు. బొయితిలి నుంచి ఇంజరి వరకూ 14 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి సర్వే సిబ్బంది సర్వే చేపట్టారు. తొమ్మిది కిలోమీటర్లు వరకూ సర్వే పూర్తిచేసి సల్లాబు గ్రామంలోకి గురువారం మధ్యాహ్నం సర్వే సిబ్బంది భోజనం చేసి విరామం తీసుకుంటున్న సమయంలో ఏడుగురు సాయుధ మావోలు వచ్చి సర్వే సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎవరు సర్వే చేయమన్నారని మావోయిస్టులు ప్రశ్నించడంతో కలెక్టర్, ఐ.టి.డి.ఎ. పి.ఒ. ఆదేశాల మేరకు రోడ్డు సర్వే కోసం వచ్చినట్టు సిబ్బంది చెప్పడంతో సర్వే చేపట్టవద్దని మావోలు హెచ్చరించారు. సర్వే సిబ్బంది నుంచి లాప్‌టాప్‌లు, జి.పి.ఎస్. మిషన్‌ను తీసుకుని సర్వే నమూనాలను మిషన్‌ను తొలగించి సామగ్రి అప్పగించారు. అనంతరం వారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరించడంతో సిబ్బంది అక్కడి నుంచి పాడేరుకు చేరుకున్నారు. సర్వే సిబ్బందికి మావోల నుంచి ఎదురైన చేదు అనుభవాలను ఐ.టి.డి.ఎ. పి.ఒ. దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలిసింది. గతంలో 2014వ ఆర్థిక సంవత్సరం ఉపాధి లబ్ధిదారులకు బయోమెట్రిక్ చేపట్టేందుకు వెళ్ళిన సిబ్బంది నుంచి కంప్యూటర్ తదితర సామగ్రిని మావోలు తీసుకెళ్లిన సంఘటనలున్నాయి. రహదారి సర్వే కోసం వెళ్ళిన సిబ్బందిపై మావోలు మరోసారి అడ్డుకుని నిర్భందించడం ఇది రెండోసారైంది. అయితే, ఇటీవల విశాఖ పోలీస్, ఐ.టి.డి.ఎ. ఆధ్వర్యంలో ఇంజరి గ్రామంలో ఇటీవల సద్భావన యాత్ర నిర్వహించిన సమయంలో ఓ.ఎస్.డి. అట్టాడ బాబూజీ ఇంజరి గ్రామంలో పోలీస్ రక్షణ కల్పించి రహదారిని నిర్మించి ఆర్టీసీ సదుపాయాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఇచ్చిన హామీ ఏ మేరకు అమవులవుతుందోనని ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.