విశాఖ

‘బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), ఫిబ్రవరి 24: బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 2017-18 బడ్జెట్‌లో 170కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ బ్రాహ్మణ సంఘం సభ్యులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అధిక బడ్జెట్ కేటాయించాలని, అలాగే ఈ సంఘం ద్వారా సామాజిక భవనం నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. దీనిపై ఎమ్మెల్యే పీలా సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కో ఆర్డినేటర్ మల్లికార్జునరావు, వసంతవాడ పురుషోత్తమరాజు తదితరులు పాల్గొన్నారు.

‘మాధవ్ గెలుపుకోసం అహర్నిశలు పనిచేస్తాం’
మునగపాక, ఫిబ్రవరి 24: ఉత్తరాంధ్ర జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న పివిఎన్ మాధవ్ గెలుపుకోసం బిజెపి ఆధ్వర్యంలో అహర్నిశలు పనిచేస్తామని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు డాక్టర్ బద్దెం సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం మేజర్ పంచాయతీ మునగపాకలో పట్ట్భద్రుల వద్దకు వెళ్లి మాధవ్‌కు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. టీడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా గెలుపుకోసం ఇరుపార్టీలు పనిచేస్తాయని, అలాగే మునగపాక, అచ్యుతాపురం, పరవాడ మండలాల ఇన్‌చార్జిగా తనను నియమించారని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఈయన వెంట మండల దళిత మోర్చ అధ్యక్షుడు తోటాడ జగన్, ప్రధాన కార్యదర్శి బీర గణేష్, చొప్పా పైడిరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కారు అప్పారావు, వేగి గణేష్, ప్రతాప్ తదితరులు ఉన్నారు.

నేడు లా-యూనివర్శిటీలో మూట్ కోర్టు పోటీలు
సబ్బవరం, ఫిబ్రవరి 24: మండలంలోని అసకపల్లి పంచాయతీ పరిధి లోగల దామోదర సంజీవయ్య నేషనల్ లా-యూనివర్శిటీలో ఈ నెల 25, 26 తేదీల్లో మూట్ కోర్టు పోటీలు నిర్వహించనున్నట్టు ఆ యూనివర్శిటీ రిజిస్ట్రార్ సిపి దయానందమూర్తి, ఫ్యాకల్టీ సలహాదారు బి.సోమ తెలిపారు. శుక్రవారం ఇక్కడి యూనివర్శిటీ లో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన స్థానిక విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. భారత దేశంలోని వివిధ జాతీయ యూనివర్శిటీల నుంచి 21 జటుల పాల్గొంటాయన్నారు. ఒక్కోటీమ్‌కు ముగ్గురు న్యాయ విద్యార్థులు పోటీలో పాల్గొంటారు. ఈనెల 25న ఉదయం 8.30గంటలకు ఇక్కడి న్యాయ ప్రశాంత హాలులో ఈపోటీలను దామోదర సంజీవయ్య వ్యవస్థాపక వైస్ చాన్సలర్ వై.సత్యనారాయణ ప్రారంభిస్తారని చెప్పారు. ప్రస్తుత లా-వర్శిటీ ఉప కులపతి వి.కేశవరావు పాల్గొంటారు. పోటీలకు దేశంలోగల సుమారు 18 నేషనల్ లా-యూనివర్శిటీల్లో సబ్బవరం తప్ప మిగిలిన యూనివర్శిటీ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. అయితే ఈ పోటీలకు న్యాయశాస్త్ర విద్యార్థులు ఫస్ట్‌ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఆసక్తిగల వారు పాల్గొనే అవకాశం కల్పిస్తారన్నారు. న్యాయశాస్త్రంలో ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్ (వాద ప్రతివాదాలు) చేయటంలో అత్యంత నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా 30వేల రూపాయల నగదుతోపాటు షీల్డ్ అందజేస్తారు. రన్నర్‌గా నిలిచిన అభ్యర్థికి 15వేల రూపాయల నగదుతోపాటు షీల్డ్‌ను అందజేస్తారు. ఆలాగే బెస్ట్‌మెమొరీ ప్రదర్శించిన న్యాయవాదికి 10వేల రూపాయల ప్రత్యేక బహుమతి, షీల్డ్, బెస్ట్‌స్పీకర్‌కు 8 వేలు, బెస్ట్‌ఆర్గ్యుమెంట్‌కు ఒక్కొక్కరికి 8వేల రూపాయల చొప్పున బహుమతులు అందజేస్తారని వివరించారు. ఈపోటీల ముగింపు సమావేశం ఈనెల 26న జరుగుతున్నందున ఆ రోజు జరిగే ఫైనల్ పోటీలకు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు జస్టిస్ రమేష్ రంగనాథన్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో డిఎస్‌ఎస్‌ఎల్ వర్శిటీ ప్రారంభమయ్యాక నిర్వహిస్తున్న మూట్ పోటీల్లో ఇది మూడోదని వారు తెలిపారు. మొట్టమొదటి నిర్వహించిన మూట్‌కోర్ట్ పోటీల్లో ట్రైస్ట్‌యూనివర్శిటీ బెంగూళూరు విద్యార్థులు విన్నర్స్‌గా నిలువగా, రెండవ సారి నొయిడాలా-యూనివర్శిటీలకు ఆ ఖ్యాతి దక్కిందని రిజిస్ట్రార్ దయానందమూర్తి తెలిపారు. ఈ సమావేశంలో లా-యూనివర్శిటీ పిఆర్‌వో విశ్వచంద్ర పాల్గొన్నారు.