విశాఖ

మంచినీటి ఎద్దడి నివారణకు రూ. 140 కోట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావికమతం, ఫిబ్రవరి 24: ఈ ఏడాది వేసవిలో మంచినీటి ఎద్దడి నెలకొనకుండా జిల్లాకు 140 కోట్లు కేటాయించినట్టు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. కళ్యాణపులోవ పోతురాజుబాబును దర్శించుకున్న అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. మంచినీటి ఎద్దడి నివారణకు ప్రతీ మండలంలో తాత్కాలిక విచారణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 35 కోట్లు నిధులు విడుదల చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి కళ్యాణపులోవ రిజర్వాయర్, కోనాం రిజర్వాయర్లలో వాటర్ గ్రిడ్ పథకం ఏర్పాటుకు 250 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ఫ్రభుత్వానికి పంపించినట్టు తెలిపారు.
ఈనిధులు మంజూరైతే నియోజకవర్గం నాలుగు మండలాల్లో మంచినీటికి ఢోకా లేదని వివరించారు. 2018 నాటికి పోలవరం, పురుషోత్తపురం ఎత్తిపోతల పథకాలను కచ్చితంగా పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీని వలన జిల్లాలో లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తామని తెలిపారు. కళ్యాణపులోవ క్షేత్రాన్ని విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేకె. ఎస్.ఎన్.రాజుతో పాటు ఎం.పి.పి. దంగేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రెండు బైక్‌లు ఢీ-నలుగురికి గాయాలు
ఎస్.రాయవరం, ఫిబ్రవరి 24: మండలంలోని అడ్డురోడ్డు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం పెదగుమ్మలూరు శివాలయం నుండి బైక్‌పై తిరిగి వెళుతున్న కర్రి రామకృష్ణను తునివైపు వెళుతున్న బైక్ ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో రామకృష్ణతోపాటు రామలక్ష్మి, జస్వంత్, ఎడ్ల ధర్మలను నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అదే సమయంలో నక్కపల్లి ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే అనిత బాధితులకు మెరుగైన వైద్యం కోసం వైద్యాధికారులను ఆసుపత్రి చైర్మన్‌కు ఆదేశాలు జారీచేశారు. రామకృష్ణకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం కెజిహెచ్‌కు తరలించారు.