విశాఖ

ఉత్సాహభరితంగా ఎడ్లబళ్ల పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఫిబ్రవరి 24: మండలంలోని రాయపురాజుపేట గ్రామంలో శివరాత్రి జాతర మహోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి ఎడ్లబళ్ల పందాలు ఉత్సాహభరితంగా సాగాయి. శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో చుక్కపల్లికి చెందిన మజ్జి లోకేష్ ఎడ్లబండి ప్రథమ, ద్వితీయ స్థానాలను దక్కించుకుని వరుసగా పదివేలు, ఎనిమిదివేల రూపాయల బహుమతులను అందజేశారు. అలాగే తృతీయ స్థానంలో కొత్తపెంటకు చెందిన రొంగలి రవితేజ ఎడ్లబండి, నాలుగో స్థానంలో సింహాద్రిపురానికి చెందిన అభయాంజనేయ ఎడ్లబండి, అయిదో స్థానంలో నర్సాపురానికి భరతతేజస్విని ఎడ్లబళ్లు గెలుపొందాయి. వీరికి వరుసగా ఆరువేలు, నాలుగువేల, రెండువేల రూపాయల నగదు బహుమతులు అందజేశారు. అంతకుముందు ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. రాయపురాజుపేట గ్రామంతోపాటు పరిసర గ్రామాలైన నర్సాపురం, సీమునాపల్లి గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ భారీ ఎత్తున భక్తులకు అన్ని విధాలా సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి కనిశెట్టి మత్స్యరాజు, ఎంపీటిసి బొడ్డేడ రామునాయుడు, మండల దేశం పార్టీ అధ్యక్షులు బొడ్డేడ గంగాదర్ తదితరులు పాల్గొన్నారు.