విశాఖ

అరడకోట ఆశ్రమ విద్యార్థి మృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదబయలు, ఫిబ్రవరి 28: పెదబయలు మండలం అరడకోట ఆశ్రమంలోని గిరిజన విద్యార్థి అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఆశ్రమంలో ఆరో తరగతి చదువుతున్న ఎగువ బొండాపల్లి గ్రామానికి చెందిన నాయుడు శివాజి(11) మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి మరణానికి పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరే కారణమని ఆరోపణలు వినిపిస్తుండగా ఉపాధ్యాయులు చెబుతున్న పరస్పర విరుద్ధమైన వివరణలు ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. అయితే తమ కుమారుడు మృతి చెందడంపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాల ఉపాధ్యాయులను నిలదీశారు. శివాజి సోమవారం మధ్యాహ్నాం గుండెపోటుకు గురయ్యాడని ఉపాధ్యాయులు చెబుతుండగా వాంతులు విరోచనాలతో బాధపడుతున్నాడని అదే ఉపాధ్యాయులు మరోక కారణం చెబుతున్నారు. అయితే, సోమవారం రాత్రి ఆశ్రమంలోనే మృతి చెందినప్పటికీ మంగళవారం ఉదయం పాడేరు ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయిస్తుండగా మృతి చెందినట్టు ఉపాధ్యాయులు మొదట పేర్కొని ఆ తరువాత మార్గమధ్యలో చనిపోయాడని చెబుతున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పాఠశాల ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించకపోవడంతో సోమవారం రాత్రి ఆశ్రమంలోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. తమ కుమారుడు మృతి చెందిన విషయాన్ని ముందుగా ఎందుకు తెలియచేయలేదని, ఆసుపత్రిలో మృతి చెందినట్టయితే మృతదేహాన్ని అక్కడే ఉంచి తమకు సమాచారం అందించకుండా గ్రామానికి ఎందుకు తీసుకువచ్చినట్టని వారు ప్రశ్నించారు. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య చాలాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని, తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం నాయకులు రంగంలోకి దిగి విద్యార్థి తల్లిదండ్రులకు నచ్చచెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి విద్యార్థి మృతికి కారకులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరాపల్లి ఎం.పి.టి.సి. మాధవరావు, మృతుడి తల్లిదండ్రులు, గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేసారు.