విశాఖపట్నం

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఫిబ్రవరి 28: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు మార్చి ఒకటవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు నిర్వహిస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి టి.నగేష్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 118 పరీక్షా కేంద్రాల్లో 1,17,062 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్ధులు కలిపి 54,022 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి 53,040 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 306 కళాశాలలు ఉండగా 118 కేంద్రాల్లో జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక హైపవర్ స్క్వాడ్‌ల కమిటీ...
ఈ ఏడాది ప్రత్యేకంగా ఐదు సిటింగ్ స్వ్కాడ్‌లు, మరో నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లతోపాటు వృత్తి విద్యాశాఖాధికారి నేతృత్వంలో ఒక కమిటీ, కలెక్టర్ ప్రతినిధిగా, రెవెన్యూ, పోలీసులతో కూడిన హైపవర్ కమిటీతోపాటు ఆర్‌ఐఓ బృందంతో కూడిన కమిటీ, రాజమండ్రి ప్రాంతీయ సంచాలకులు, ప్రభుత్వ పరిశీలకులు పరీక్షల నిర్వహణపై తనిఖీలు చేయనున్నారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా
అనుమతించం...
ప్రతి ఏడాది ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంటూ ఇంటర్ బోర్డు కొత్త నిబంధనలు అమలు చేస్తుంది. దీనిలోభాగంగానే ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షలు ప్రారంభాం కానున్న నేపధ్యంలో 9 గంటల తరువాత వచ్చే విద్యార్ధులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీకావడంతో ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అంటూ పేర్కొన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిసి కెమెరాల నిఘాలు మరింత విస్తృతపరుస్తున్నట్టు ఆర్‌ఐఓ తెలిపారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో మార్చి 9వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను 19వ తేదీకి వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు. అలాగే పరీక్షలకు సంబంధించి విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఇన్విజిలేటర్లు, ఇతర నిర్వాహాకులు అత్యవసర సమాచారం కోసం ప్రాంతీయ కార్యాలయంలో హెల్ఫ్‌లైన్ల సెంటర్లు ఏర్పాటు చేసామని, 0891-2552854, 2587561 నెంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.