విశాఖపట్నం

శాసనమండలి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 28: ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గానికి సంబందించి శాసనమండలి ఎన్నికలను పారదర్శకంగా న నిర్వహించాల్సిందిగా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, రూట్ అధికారులు, జోనల్ అధికారులు, సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 9వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, సజావుగా, ఎటువంటి ఒడిదుడుగులు లేకుండా నిర్వహించాలన్నారు. మార్చి 8,9 తేదీలు చాలా ముఖ్యమైనవన్నారు. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గానికి చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి సంబంధించి 30 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలిచారన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 8వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఎన్నికల జరుగుతాయన్నారు. 8వ తేదీన ఉదయం ఆరు గంటలకు పోలింగ్ అధికారులు స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియానికి చేరుకుని ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్‌ను తీసుకుని అక్కడ ఏర్పాట్లు చేసిన ప్రత్యేక వాహనాల్లో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. రూట్ అధికారులు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద దింపడం జరుగుతుందన్నారు. అక్కడ విఆర్‌ఓలు, పంచాయితీ సెక్రటరీలు అందుబాటులో ఉండి కో-ఆర్డినేట్ చేస్తారన్నారు. సెక్టోరల్, జోనల్ అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముం దుగా విజిట్ చేసి అన్ని వౌలిక సదుపాయాలు ఉన్నదిలేనిది తనిఖీ చేయాలన్నారు. నిరంతర విద్యత్ సౌకర్యం ఉండే విధంగా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ పెట్టడం జరుగుతుందన్నారు. పోలింగ్ నిర్వహణ విధానాలను జాగ్రత్తగా తెలుసుకోవాలన్నారు. ఇంకా అనుమానాలు కలిగితే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రంలో పీఓలు, ఏజెంట్‌లు కూర్చునే విధానాలకు అనుగుణంగా లేవుట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునే ఓటర్లు తమ పేరును నమోదు చేయించుకోవాలన్నారు. ఓటర్ల లిస్టులో నమోదైన ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తే భారత ఎన్నికల కమిషన్ చాలా కఠినంగా వ్యవహరించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటుందన్నారు. కాబట్టి అధికారులంతా జాగ్రత్తగా తమకు అప్పజెప్పిన విధులను నిర్వర్తించాలన్నారు. ట్రైనింగ్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్-2 డి.వెంకటరెడ్డి మాక్ పోలింగ్ నిర్వహించారు. ప్రీసైడింగ్, పోలింగ్ అధికారులు, ఏజెంట్లు, ఓటింగ్ వేసే పద్ధతులను లేవుట్ ద్వారా వివరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎన్నికల నియమావళికి సంబంధించి పోలింగ్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై అవగాహన కలిగించారు. బ్యాలెట్ పేపర్ల వినియోగం చేపట్టాల్సిన అంశాలపై సవివరంగా వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రీపైసిడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, రూట్ అధికారులు, జోనల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.