విశాఖపట్నం

ప్రై‘వేటు’ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప్రైవేటు ట్రావల్స్ బస్సుల్లో ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం సుఖము..సురక్షితము అయితే, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం గ్యారెంటీ లేకుండాపోయింది. అతి వేగం ప్రమాదం అన్న రోడ్డు రవాణా శాఖ నినాదం కేవలం స్టిక్కర్లు, ఫ్లెక్సీలకే పరిమితపైపోయింది. గంటకు కనీసం 100 కిలో మీటర్ల వేగంతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వం ఇసుమంతైనా చర్యలు తీసుకోలేకపోతోంది. ప్రైవేటు బస్సుల సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీన వైఖరికి వందల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అనేక మంది తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగుల్చుతున్నాయి. కుటుంబ పెద్దలు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు దిక్కులేనివారైపోతున్నారు. అయినా వీరిపై ప్రభుత్వం కొరడా ఝళిపించడం లేదు. ప్రైవేటు బస్సుల వేగాన్ని తగ్గించడానికి చర్యలూ తీసుకోవడం లేదు. ఆర్టీసి బస్సులకు మాదిరి స్పీడ్ గవర్నర్‌ను ప్రైవేటు బస్సులకు కూడా అమర్చడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందో అర్థం కావడం లేదు. ఆర్టీసీ బస్సులకు స్పీడ్ గవర్నర్‌ను చాలా కాలంగా అమలు చేస్తున్నారు. ప్రైవేటు ట్రావల్స్ బస్సులకు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే చాలా వరకూ ప్రమాదాలు నివారించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెపుతున్నారు. అయితే వోల్వా బస్సులు మంచి కండిషన్‌లోనే ఉంటాయి కనుక స్పీడ్ గవర్నర్ అక్కర్లేదని ట్రావల్స్ యజమానులు చెపుతున్నారు. రాత్రి వేళ అతి వేగంగా వెళుతున్న బస్సులను నియంత్రించడంలో డ్రైవర్లు విఫలమవుతున్నారు. అందులన స్పీడ్ గవర్నర్ ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సమయంతో పరుగులు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు నిర్దేశించిన సమయాలకు చేరుకోవాలని ప్రైవేటు బస్సు ట్రావల్స్ యాజమాన్యం డ్రైవర్లను ఆదేశిస్తున్నారు. దీంతో బస్సులను వేగంగా నడపాల్సి వస్తోంది. అలాగే విశాఖ, హైదరాబాద్ వంటి నగరాల్లోని వివిధ ప్రదేశాల నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని బస్సులు బయల్దేరుతుంటాయి. నగరంలో భారీ వాహనాలను రాత్రి ఎనిమిది తరువాత కానీ అనుమతించడం లేదు. దీంతో బస్సులు ఆలస్యంగా ఆయా నగరాల నుంచి బయల్దేరుతున్నాయి. ఈ లేటును భర్తీ చేయడానికి బస్సులను వేగంగా నడుపుతున్నారు.
విశాఖ నుంచి 2000 మందికి పైగా ప్రయాణం
ఇదిలా ఉండగా విశాఖ నగరం నుంచి హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు రోజుకు 50 ప్రైవేటు బస్సులు బయల్దేరి వెళుతున్నాయి. వీటిలో 2000 మంది ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సులు విశాఖలో ఖాళీగా ఉండకుండా, శ్రీకాకుళం, విజయనగరాలకు వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకుని వచ్చి, విశాఖలో మిగిలిన సీట్లను భర్తీ చేసుకుని హైదరాబాద్, విజయవాడకు బయల్దేరి వెళుతున్నాయి. విశాఖ నుంచి రోజుకు హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు 10 వేల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో సుమారు 2000 మంది ఆర్టీసీ బస్సుల్లో, ఐదు నుంచి ఆరు వేల మంది రైళ్లలో హైదరాబాద్ వైపు వెళుతున్నారు. మిగిలినవారు గమ్య స్నానాలు చేరుకోడానికి రవాణా సదుపాయల్లేకపోవడంతో ప్రైవేటు ట్రావల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తే, ప్రైవేటు బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గవచ్చని అధికారులు అంటున్నారు.
పట్టుకుంటే రూ.2000 ఫైన్
ప్రైవేటు బస్సులు స్టేజ్ క్యారియర్ సర్వీసు చేయడానికి విల్లేదు. అంటే ఒక బస్సు బయల్దేరిన చోట నుంచి నిర్దేశిత గమ్యస్థానాన్ని చేరుకోవాలే తప్ప, మధ్యలో టిక్కెట్‌లను ఎక్కించుకోడానికి వీల్లేదు. ఇది నేరం. రవాణా శాఖ అధికారులు ఎప్పుడైనా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, స్టేజ్ క్యారియర్ టిక్కెట్‌లు ఎక్కించినట్టు రుజువైతే, ఆ బస్సుకు కేవలం 2000 రూపాయలు ఫైన్ మాత్రమే విధిస్తారు. ఆ డబ్బును బస్సు యాజమాన్యం సునాయాసంగా కట్టేస్తున్నారు. యథావిధిగా స్టేజ్ క్యారియర్ సర్వీస్‌ను కొనసాగిస్తున్నారు.