విశాఖ

మణికుమారికి మరోసారి భంగపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మార్చి 6: శాసనసభ్యుల కోటాలో శాసనమండలికి వెళ్లేందుకు అధికార తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ను ఆశించిన మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారికి మరోసారి భంగపాటు ఎదురయ్యింది. ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం తనవంతు ప్రయత్నం చేసిన మణికుమారికి ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మొండి చెయ్యి చూపించడంతో ఆమె తీవ్ర ఆవేదనకు లోనయినట్టు తెలుస్తోంది. శాసనసభ్యుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో గిరిజన, హరిజన, వెనుకబడిన వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించాలని బాబు నిర్ణయించడంతో గిరిజన కోటాలో తనకు అవకాశం కల్పించాలని ఆమె అభ్యర్థించారు. ఈ సారి ఏలాగైనా ఎమ్మెల్సీ టిక్కెట్‌ను సాధించుకోవాలనే తపనతో మణికుమారి రెండు రోజుల పాటు విజయవాడలో మకాం వేసి తనకున్న రాజకీయ పలుకుబడితో పావులు కదిపినప్పటికీ ఆఖరి నిమిషంలో ఆమెకు నిరాశే ఎదురయ్యింది. అయితే మణికుమారి అభ్యర్థిత్వాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి అన్ని కోణాలలో భేరేజు వేసుకుని ఆమెకు టిక్కెట్ కేటాయించలేదని చెబుతున్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్‌ను దక్కించుకోవడంలో మణికుమారి విఫలం చెందడానికి ఆమె స్వయంకృతాపరాదమే కారణంగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉండే విశాఖ మన్యంలో దేశం ప్రస్తుతం అత్యంత గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుందనే చెప్పాలి. మన్యంలో పార్టీ దిగజారిపోవడానికి స్థానిక నాయకత్వమే కారణంగా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంత నాయకుల వ్యవహార శైలి వలన ఏజెన్సీలో పార్టీ మనుగడ దిగజారిపోయిందని విశ్వసిస్తున్న బాబు మన్యం నేతంల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ సమావేశాలలో ముఖ్యమంత్రి పలుసార్లు ఈ ప్రాంత నాయకులకు హితబోద చేసినప్పటికీ వారిలో ఎటువంటి మార్పురాలేదని అంటున్నారు. ఏజెన్సీలో పార్టీ మనుగడకు స్థానిక నాయకత్వం ఏమాత్రం కృషి చేయకపోవడమే కాకుండా వర్గ విభేదాలతో పార్టీని నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహాంతో ఉన్నట్టు చెబుతున్నారు.మన్యంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో బలంగా నాటుకుపోవడం, ప్రతిపక్షానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుండడం వంటి పరిణామాలు కూడా ముఖ్యమంత్రి గమనించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే చురుకుగా పనిచేస్తుండగా అధికార పార్టీలో ఉన్న తెలుగుతమ్ముళ్లు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండడం బాబుకు ఏమాత్రం రుచించలేదని అంటున్నారు. తన మంత్రివర్గంలో ఐదు సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన మణికుమారి ఏజెన్సీలో పార్టీ పటిష్టతకు పాటుపడాల్సి ఉన్నా ఆమె నిస్తేజంగా ఉంటూ పార్టీ కార్యకలాపాలను నిర్వహించకపోవడం బాబు అసహనాన్ని మరింత పెంచిందని చెబుతున్నారు. దీంతో పార్టీ కోసం పనిచేయని నాయకత్వానికి ఎటువంటి అవకాశాలు ఇచ్చినా ప్రయోజనం లేదనే ఉద్దేశ్యంతో మణికుమారిని పూర్తిగా పక్కనపెట్టినట్టు తెలియవచ్చింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయకుండా మిత్రపక్షమైన బి.జె.పి.కి ఈ సీటు కేటాయించడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. అయితే ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పటి నుంచి ఇంతవరకు కూడా నాయకుల తీరులో ఎటువంటి మార్పు రాకపోవడం, పార్టీ కోసం ఏమాత్రం పనిచేయకపోవడం వంటి అనేకానేక కారణాలు దాగి ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సేకరించిన నివేదిక ప్రకారం ఏజెన్సీలో తెలుగుతమ్ముళ్ల పనితీరు ఆశాజనకంగా లేకపోవడమే కాకుండా కొంతమంది నాయకులు బహిరంగంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అంశాలు కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని తెలుగుతమ్ముళ్లకు ఇకపై ఎటువంటి ప్రాధాన్యత కల్పించరాదని ముఖ్యమంత్రి దాదాపు నిర్ణయించుకుని మణికుమారికి ఎం.ఎల్.సి. టిక్కెట్‌ను కేటాయించలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత నాయకులు తమ పనితీరును మెరుగుపరుచుకోకపోతే రానున్న కాలంలో మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొక తప్పదని అంటున్నారు. ఏదిఎమైనా ఎప్పటి నుంచో పదవి కోసం వేచి చూస్తున్న మణికుమారికి భంగపాటు తప్పకపోవడం ఆమె రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఎటిఎంలలో నగదు కొరత
అనకాపల్లి, మార్చి 6: పాతనోట్ల రద్దు ప్రభావంతో తీవ్ర కరెన్సీ కొరతతో విలవిల్లాడిపోయిన పేద, మధ్య తరగతి వర్గాల వారు నగదు ఉపసంహరణపై కాస్తంత ఆంక్షలు సడలించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాతనోట్ల రద్దు సమయంలో రెండువేల రూపాయలుగా ఉండే నగదు ఉపసంహరణ మొత్తం వారానికి 50వేల రూపాయల వరకు పెరగడంతో నగదు లవాదేవీలు ఒకేసారి ఊపందుకున్నాయి. ఇక నగదు కొరత తీరినట్లేనని అన్నివర్గాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో సోమవారం అనకాపల్లి పరిసర ప్రాంతంలోని అన్ని ఏటిఎం కేంద్రాల్లో నయాపైసా నగదు లేక విలవిల్లాడిపోయారు. పట్టణంలోని ఏ ఏటిఎం సెంటర్‌కు వెళ్లినా నగదు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగదు ఉపసంహరణ మొత్తాన్ని ఒకేసారి పెంచడంతో దాదాపు అన్ని ఖాతాల నుండి కూడా నగదు ఉపసంహరణ మొత్తం ఒకేసారి ఊపందుకుందని, ఏటిఎం సెంటర్‌లో ఇట్టే నగదు వేస్తే అట్టే అయిపోతుందని బ్యాంక్ అధికారులు తల లు పట్టుకుంటున్నారు. అనకాపల్లి పట్టణంలోని ప్రధాన ఎస్‌బిఐ ఏటిఎం కేంద్రంలో నగదును డిపాజిట్ చేసుకోవడమే తప్ప తీసుకునే సౌలభ్యం కానరాలేదు.నెలలో మొదటి వారం కూడా గడవకముందే ఏటిఎం సెంటర్లలో నగదు లేకపోవడంతో బ్యాంకుల్లో జమ అయిన నగదును తీసుకునే పరిస్థితి కానరాక పేద, మధ్య తరగతి వర్గాల వారు విలవిల్లాడిపోతున్నారు.