విశాఖ

ముగిసిన ప్రచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్యాణమండపాలు, లాడ్జిలు, హోటళ్ళు తక్షణమే ఖాళీ చేయాలని, పోలీసుల తనిఖీలుంటాయని, పట్టుబడిన అనుమానిత వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. డిసిపి నవీన్ గులాటి మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి పూర్తి బందోబస్తుతో సిద్ధంగా ఉన్నామని, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా అనుమానిత వ్యక్తులకు వారెంట్లు జారీ చేశామని, స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియం పోలీసు బందోబస్త్ స్పెషల్ సెల్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఈ సమావేశంలో జెసి సృజన, డిఆర్‌ఓ చంద్రశేఖరరెడ్డి, అదనపు ఎస్‌పి రాజ్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల సరళిని నిశితంగా పరిశీలించండి
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న మైక్రోఅబ్జర్వర్లు పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. జిల్లాప్రజాపరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల విధానాన్ని నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులు, అభ్యర్థులకు చెందిన ఏజెంట్లు ఉంటారని, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీతోపాటు మైక్రోఅబ్జర్వర్ల పరిశీలన ముఖ్యమని ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్ గుర్తింపుకార్డులు పరిశీలించాలని, బోగస్, డూప్లీకేట్ ఓటర్లను గుర్తించాలని, ఎవరైనా ఉల్లఘించినట్టు అనుమానం వస్తే కేసులు నమోదు చేయాలన్నారు. పోలింగ్ బూత్‌లో ఏమైనా సంఘటనలు తలెత్తితే జనరల్ అబ్జర్వర్‌కు తెలియజేయాలని, ఆరు గంటలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే చెక్ లిస్టు పరిశీలనకు అందజేయాల్సి ఉంటుందన్నారు.

ఎవరేమన్నారంటే..!
పార్టీ పేరు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఎల్‌ఐసిలో పనిచేసిన శర్మ, అందులో ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించలేకపోయారు. ఐసిడిఎస్ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి ప్రతి నెలా కోట్ల రూపాయలను కమ్యూనిస్ట్ పార్టీలు వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి అది కమ్యూనిస్ట్ పార్టీ కాదు, క్యాప్టలిస్ట్ పార్టీ. అటువంటి పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి ఏమాత్రం జరగదు.
-సోము వీర్రాజు

జనవరిలోగా జోన్ రాకపోతే
రాజకీయాల నుంచి తప్పుకుంటా
వచ్చే జనవరిలోగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. జోన్ విషయంలో విశాఖ ప్రజలకు స్పష్టత ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర నాయకులు ఇంకా తర్జనభర్జనపతడుతున్నారు. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వస్తుంది. అలాగే, హోదాకు బదులుగా వచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పించాలి. బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి మాధవ్‌ను గెలిపిస్తేనే ఇది సాధ్యపడుతుంది. విశాఖకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విస్తృతమైన సహకారం అందుతోందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. స్వచ్ఛమైన రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందిన పివి చలపతిరావు వారసునిగా వస్తున్న మాధవ్‌కు ఓటర్లు మద్దతు తెలపాలి. అప్పుడే చలపతిరావును కూడా గౌరవించుకున్నట్టవుతుంది.
ఎస్‌ఎ రెహమాన్
మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్

బిజెపి, టిడిపిలకు ప్రజా సమస్యలు పట్టవు
టిడిపి, బిజెపిలకు ప్రజా సమస్యలు పట్టవు. పిడిఎఫ్ రెండు సార్లు గెలుపొందినా, విశాఖకు ఒరగబెట్టిందేమీ లేదు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని బిజెపి, యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని టిడిపిలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. దీనివలన ఈ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఒక జర్నలిస్టుగా మూడు దశాబ్దాలపాటు తను సమాజానికి పనికొచ్చే అనేక కథనాలు రాశాను. ప్రభుత్వానికి నిధులు ఆదా అయ్యేలా నా కథనాలు కదిలించాయి. ఎన్నికల ప్రచారంలో ఓటర్లు వివిధ సమస్యలను తన దృష్టికి తెచ్చారు. ఎన్నికలైపోయాయని తన దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దగ్గరకు తీసుకువెళ్లి, పరిష్కరించడానికి కృషి చేస్తాను. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే, ఉత్తరాంధ్ర సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తాను.

వివి రమణమూర్తి
ఇండిపెండెంట్ అభ్యర్థి

నేడే ఉపమాక వెంకన్న
వార్షిక కల్యాణోత్సవం
ఆలయాన్ని నిర్మించినట్లు క్షేత్ర మహోత్సవం ద్వారా తెలుస్తోంది. కొండ దిగువన శ్రీ వేణుగోపాలస్వామివారిని శ్రీ నారద మహాముని ప్రతిష్ఠించినట్లు చరిత్ర ఇతివృత్తం. ఇక్కడున్న రామాలయంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారు ఉన్నారు. అలాగే శ్రీ ఆండాళమ్మవారి మూలవిరాట్, నమ్మాళ్వార్, ఉభయవరులు, మనవాళ, మహామునులు మూల విరాట్‌లు కొలువుదీరి ఉన్న ఈ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కళియుగ స్వామిగా శ్రీ వేంకటేశ్వరుని భక్తజనాలు కొలవడం పరిపాటి. ఈ ఆలయం ఏనాటి నుండో పర్యాటక కేంద్రంగా అలరారుతుంది. ఇరువురు వైష్ణవ స్వాములు అహోబిలం నుండి తీర్ధయాత్రల కోసం కాశీ, రామేశ్వరానికి వెళుతుండగా మార్గమధ్యం నందు గల ఇక్కడి స్వామివారిని దర్శించారని చెబుతుంటారు. అంతట శ్రీవారు తనకు నిత్య పూజాధికాలు నిర్వహించేందుకు వారిని ఇక్కడ ఉండాల్సిందిగా ఆజ్ఞాపించినట్లుగా 80వ వైష్ణవ కుటుంబాలు ఈ ఆలయానికి వచ్చినట్లుగా క్షేత్ర మహాత్యం ద్వారా తెలుస్తుంది. జగద్గురువులు శ్రీ త్రిదండి రామానుజాచార్యుల వారు భారతదేశం నందు 108 దివ్యక్షేత్రములు సందర్శించి ఈ క్షేత్రాన్ని శ్లోక రూపమున తెలియజేసినట్లుగా చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అందు తార్షియాది సింహాచల్ అని వర్ణించారు. అందువలనే గరుడాద్రి అగుటవలన 11వ శతాబ్దం నందు రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు విదితమవుతుంది. ఈ దేవాలయం నందు పూజాధికాలు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి నిర్వహిస్తారు. ఈ క్షేత్రమునందు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు ద్వాదశ ఆళ్వార్, తిరు నక్షత్రాలు, శ్రీరాముని అధ్యయన ఉత్సవాలు వైకుంఠ శుద్ధ ఏకాదశిరోజున శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక కల్యాణం, ధనుస్సంక్రమణ మున్నగు కార్యక్రమాలు వైభవోపేతంగా జరిపించడం నిత్యకృత్యాలు. ఈ కేంద్రమునందు నిత్యం ఉదయం, రాత్రి వేళల్లో నారాయణ సేవాకాలము స్వామివారికి విన్నపము జరిపిస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు జివి ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో మరో ఆరుగురు అర్చక బృందం పూజా కార్యక్రమాలు ఆద్యంతం నిత్యం జరిపిస్తారు.