విశాఖపట్నం

గ్యాస్ సిలిండర్ల పేలుడుతో బెంబేలెత్తిపోయిన గుడిలోవ వాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందపురం, మార్చి 9: పెందుర్తి- ఆనందపురం హైవేపై గుడిలోవ వద్ద బుధవారం అర్థరాత్రి దాటాక జరిగిన ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో గుడిలోవ గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోంచి పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతానికి తరలించి రాత్రంతా బిక్కుబిక్కుమని గడిపారు. సుమారు 2 గంటలపాటు సిలిండర్ల పేలుడు ధాటికి వారికి కంటి మీద కునుకు పట్టలేదు.
విశాఖ ఐఒసి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ గుడిలోవ సమీపంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి తాటిచెట్టును బలంగా ఢీకొట్టగా ఆ చెట్టు విరిగి పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లపై పడింది. దీంతో ఆ వైర్లు తెగి సిలిండర్లపై పడడంతో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో లారీ, 180 సిలిండర్లు తునాతునకలయ్యాయి. సమాచారం అందుకున్న సబ్బవరం, చిట్టివలస, మర్రిపాలెం, విశాఖ నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు ఎంతో కష్టమీద మంటలను అదుపు చేశాయి. విశాఖ, విజయనగరం అగ్నిమాపక అధికారులు జి.మోహనరావు, ఇ.స్వామి, విశాఖ సిపి యోగానంద్, ఎసిపి నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్‌ఇ సూర్యప్రకాష్, ఎడి నాయుడు, డిఇ మూర్తి ప్రమాదం జరిగిన తీరును సమీక్షించారు. స్థానిక పోలీసులను సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. పేలుతున్న సిలిండర్లు పెద్ద శబ్దంతో బంక్‌కు సమీపంలో పడడంతో అక్కడి సిబ్బంది ఎటువంటి ప్రమాదం జరగకుండా అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఏ ఒక్క సిలిండరైనా బంకుపై పడుంటే ఎంత నష్టం జరిగేదో ఊహించడానికే కష్టమయ్యేదని అక్కడి పంప్ బాయ్స్, సూపర్‌వైజర్ చెప్పారు.