విశాఖపట్నం

నృసింహ వనంలో గుబాళించనున్న సంపెంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మార్చి 9 : శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానానికి చెందిన వంద ఎకరాల నృసింహవనంలో త్వరలో సంపెంగలు గుబాళించనున్నాయి. దేవస్థానం అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాగు చేస్తున్న నృసింహవనంలో సింహాచలేశుని సేవలకు అవసరమైన అనేక ఫల, పుష్పాలు అందుబాటులోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సంపెంగలు కూడా మరో ఏడాదిలో సింహగిరి నరహరి సేవలో తరించే భాగ్యానికి నోచుకోనున్నాయి. సుమారు అయిదు ఏకరాల విస్తీర్ణంలో మూడువందలకు పైగా సంపెంగ మొక్కలను సాగుచేస్తున్నారు. వాస్తవానికి ఎన్ టి పి సి సహకారంతో విశాఖ నగరాభివృద్ధి సంస్థ దేవస్థానం కేటాయించిన సుమారు నలభై ఎకరాలలో అనేక రకాల మొక్కలను వందలాదిగా నాటింది. ఈ మొక్కల్లో సంపెంగ మొక్కలు కూడా వున్నాయి. రెండేళ్ళ కిందట వుడా నాటిన ఈ మొక్కలు నిర్వహణ లోపంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారవ్వడమేకాక సగానికి పైగా మొక్కలు చనిపోయాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో ఏడాదిలో కాలపరిమితి పూరై వుడా నిర్వహణ బాధ్యతల నుండి తప్పుకోనుంది. ఇప్పటికే వుడా నాటిన మొక్కలు ఒక్కొక్కటిగా ఎండిపోతదున్న నేపథ్యంలో దేవస్థానం మొక్కల నిర్వహణ బాధ్యతను తానే స్వయంగా స్వీకరించి సాగుకు చర్యలు చేపట్టింది. మామిడి, సంపెంగ మొక్కల పై ప్రధానంగా దృష్టిపెట్టి నిరంతరం పనులు చేయిస్తోంది. దేవస్థానం నిర్వహణలోని మొక్కలు పునర్జీవం పోసుకొని దిగుబడికి సిద్ధమవుతున్నాయి. నృసింహవనంలో వుడా మొక్కుబడిగా చేపట్టిన మొక్కల పెంపకం మొత్తాన్ని దేవస్థానం తానే స్వయంగా చేపట్టుకోవాలని నిర్ణయించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.