విశాఖ

ఘనంగా ముగిసిన కె.జె.పురం గంగాదేవి పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.కోటపాడు, మార్చి 12: మండలంలోని కె.జె.పురం గ్రామంలో శనివారం గంగాదేవి పండుగ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవారికి పందిరిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అరటిగెలలు, కొబ్బరి గెలలు, బెల్లందిమ్మలు, కొత్త చీరలు, నగదు, పిండివంటలు, పుచ్చకాయలు, పనసకాయలు, తాటికాయలు వంటి వాటిని మొక్కులుగా పందిరికి అలంకరించారు. గుల్లిపల్లి, రొంగలినాయుడుపాలెం, కె.జె.పురం, గొల్లలపాలెం, ఎ.కోడూరు గ్రామాలకు చెందిన తప్పెడగుళ్లు కళాకారులు శుక్రవారం రాత్రినుండి శనివారం మద్యాహ్నం వరకు ప్రదర్శనలు నిర్వహించారు. పందిరి వద్ద భారీ అన్నదానం నిర్వహించారు. మద్యాహ్నం జరిగిన పందిరి దోపిడీతో పండుగ ఎటువంటి అవాంతరాలు లేకుండా ముగిసింది.

రక్తపరీక్షలు
కె.కోటపాడు, మార్చి 12: ఎ.కోడూరు, కింతాడల్లో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్‌వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత ఆరోగ్య, రక్తపరీక్షలు నిర్వహించారు. రెండు గ్రామాల్లో 70 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. వీరికి ఆరోగ్య అవగాహన, స్ర్తిలలో వచ్చే వ్యాధులు, సుఖవ్యాధులు, పోషకాహారంపై తగు అవగాహన కల్పించారు. సీడ్ కౌన్సిలర్ ఎల్‌టి రాజు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ పాటూరు నాయుడు, బండారు గంగునాయుడు, స్కీమ్ జోన్ సూపర్‌వైజర్ యుగంధర్, సిఎల్‌డబ్లు వై.బాలూరావు, ఆయా గ్రామాల సర్పంచ్ లెక్కల అక్కమ్మ, బండారు అరుణకుమారి పాల్గొన్నారు.