విశాఖపట్నం

నిబంధనలకు పాతర... వసూళ్ల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 12: నగరానికి చేరువుగా ఉండటం, రవాణా సదుపాయం అందుబాటులో ఉండటంతో జోన్ 6 పరిధిలోని వేపగుంట, పెందుర్తి, లక్ష్మీపురం, చినముషిడివాడ తదితర ప్రాంతాల్లో నివాస గృహాల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఏడాది కిందట భవన నిర్మాణ అనుమతులన్నీ ఆన్‌లైన్ చేయడం అనధికార నిర్మాణాలకు ఊతమిస్తోంది. గతంలో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే క్షేత్ర సిబ్బంది పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. అయితే ఆన్‌లైన్ విధానంలో అమల్లోకి వచ్చిన తరువాత, సంబంధిత వార్డు స్థాయి సిబ్బంది ముందుగా పరిశీలించి, సహాయ సిటీ ప్లానర్ (ఎసిపి)కి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే క్షేత్ర స్థాయిలోనే సిబ్బంది నిబంధనల అతిక్రమణకు ప్రోత్సాహం అందిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జోన్ పరిధిలోని సింహాచలం గోశాల నుంచి ప్రహ్లాదపురం వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని నిర్మిస్తున్న ఒక భారీ భవనంపై స్థానికులు ఇటీవల జివిఎంసి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు. అయితే భవన నిర్మాణంలో అనుమతులు పాటించలేదని తేలడంతో స్థానిక యంత్రాంగం సంకటస్థితిలో పడింది. దీంతో సిబ్బందిపై టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఇదే సంఘటనపై జోన్ కార్యాలయంలో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది.