విశాఖ

మద్యం ఏరులై పారుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), మార్చి 13: అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నిరంకుశ పాలన కొనసాగిస్తుందని ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెల్టుషాపులను పూర్తిగా ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు మరో అడుగు ముందుకువేసి ఎక్కడికక్కడ బెల్టుషాపులు ఏర్పడి రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని వైఎస్సాఆర్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద రెడ్డి ఆరోపించారు. స్థానిక పూడిమడక రోడ్డులో ఉన్న వైఎస్సాఆర్ పార్టీ రూరల్ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ మద్యం అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, వారికి త్వరలోనే ఓటు రూపంలో తగిన బుద్ది చెబుతారన్నారు. విశాఖకు రైల్వేజోన్, ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 22నుండి ఆత్మగౌరవ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్ నుండి 220కిలోమీటర్లు భీమిలి వరకు ఈ ఆత్మగౌరవ యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యాత్రలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వైఎస్సాఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. భీమిలిలో ఆత్మగౌరవ యాత్ర ముగింపు సందర్భంగా ఏప్రిల్ 4న భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. అయితే గతంలో రైల్వేజోన్ కోసం ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, తెలుగుదేశం పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో పలు పోరాటాలు చేసాయని మరి అధికారంలో ఉంటూ రైల్వేజోన్ కోసం ఎందుకు నోరుమెదపలేదని ఆయన ప్రశ్నించారు. నిరంతరం రైల్వేజోన్, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్సాఆర్ పార్టీయేనన్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఆత్మగౌరవ యాత్రకు అన్నివర్గాల ప్రజ లు పాల్గొనాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు కరువుకాటకాలతో విలవిల్లాడుతుంటే జిల్లామంత్రులకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న సమస్యలపై మంత్రులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో సుగర్ ఫ్యాక్టరీలన్నీ లాభాల బాటలో నడిచేవని, తెలుగుదేశం ప్రభుత్వం పుణ్యమాని నష్టాల ఊబిలో కొట్టిమిట్టాడుతున్నాయన్నారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేకపోవడం వలన రైతులు, కార్మికులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. జన్మభూమి కమిటీ పేరుతో ఆ పార్టీ కార్యకర్తలు పింఛన్ల పంపిణీ, రేషన్‌కార్డులు తదితర సంక్షేమ పథకాల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. నిజమైన అర్హులకు పింఛన్లు అందడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, పట్టణాధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, మండలాధ్యక్షులు గొర్లి సూరిబాబు, కశింకోట మండలాధ్యక్షులు గొల్లవిల్లి శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, ఒమ్మి రామూయాదవ్, ఆళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.