విశాఖ

రుషికేశ్‌లో శ్రీ శారదాపీఠం శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 13: జ్ఞానభూమి రుషికేశ్‌లో జగద్గురువు గీతాచార్యుడు (శ్రీకృష్ణ భగవానుడు) ఆలయ సమీపంలో శ్రీ శారదాపీఠం నిర్మాణానికి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి భూమి పూజ నిర్వహించారు. రుషికేశ్‌లో బిజెపి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రేమ్‌చంద్ అగర్వాల్, లక్ష్మీ కండోరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా రుషికేశ్‌ళో తాను చాతుర్మాస దీక్ష నిర్వహిస్తున్నానని, ఇదే ప్రాంతంలో గీతాచార్యుని ఆశీస్సులు పొందడం అదృష్టంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మానవుడు డబ్బు సంపాదనలో పడి యాంత్రిక జీవితం గడుపుతున్నాడని అన్నారు. మన విద్యా విధానంలో లోపాలే ఇందుకు కారణమన్నారు. గత రెండు దశాబ్ధాలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే యువతీ,యువకులు మానసిక స్థైర్యం, శీలం, నిజాయితీ కోల్పోతున్నారని అన్నారు. పురాణాల్లోని శ్రీరాముడు, భీష్ముడు, శ్రీ కృష్ణుడు వంటి వారితో పాటు ఆధునిక కాలంలో భగత్‌సింగ్, వివేకానందుడు వంటి వారి జీవితాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భగవద్గీత మనిషిలో ఎంతటి మార్పు తీసుకువస్తుందో మహాత్మా గాంధీని చూసి నేర్చుకోవాలన్నారు. అలాగే ఉపనిషత్తులు తీసుకువచ్చే మార్పు వివేకానందుని జీవితాన్ని ప్రస్పుటం చేస్తాయన్నారు. అటువంటి మహాత్ముల చరిత్రలను పాఠశాల దశలో విద్యార్థులకు అలవాటు చేయాలన్నారు. దేశ,విదేశాల నుంచి వస్తున్న సందర్శకులు భారీతీయ సంస్కృతి, దేవాలయాలపై అధ్యయనం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వంలో పెద్దలు మేథావులు మేలుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి శ్రీ బాలస్వామి, ఆస్థాన పండితులు కృష్ణశర్మ, సుప్రీంకోర్టు న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ దంపతులు పాల్గొన్నారు.