విశాఖపట్నం

ఘనంగా పొట్టిశ్రీరాములు జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. దీంట్లో భాగంగా ఉక్కునగరంలో గల పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు నివాళులర్పించారు. వైఎస్సార్‌టియుసి ఆధ్వర్యంలో ఉక్కునగరంలో గల ఆ యూనియన్ కార్యాలయంలో పొట్టి శ్రీరాముల జయంతి ఉత్సవాలను నిర్వహించగా, వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ పెదగంట్యాడ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు చేసిన కృషిని వివరించారు. తెలుగు రాష్ట్రం కోసం చివరకు ప్రాణాలు అర్పించడంతో ఆయన త్యాగం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. ఆయన చేసిన కృషికి నెల్లూరు జిల్లాకు ప్రభుత్వం ఆయన పేరు పెట్టిందన్నారు. పొట్టి శ్రీరాముల అడుగుజాడల్లో నేటి యువత నడవాలని పలువురు కోరారు. ఉక్కునగరం టెక్నికల్ శిక్షణ కేంద్రం వద్ద గల పొట్టి శ్రీరాముల ఉద్యానవనంలో ఆర్‌ఐఎన్‌ఎల్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలను నిర్వహించారు. దీంట్లో భాగంగా ఉక్కు పర్సనల్ డైరెక్టర్ కిశోర్ చంద్రదాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిజిఎం ప్రసాద్, కార్మిక సంఘాల నాయకులు ఎన్.రామారావు, డి. ఆదినారాయణ, ఎం ఎన్ రెడ్డి, వై.మస్తానప్ప, జగన్నాధరావు, సత్యానంద్, ఎన్‌వి రమణ, జి.బోసుబాబు తదితరులు పాల్గొన్నారు. పెదగంట్యాడలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల 116 జయంతి వేడుకలను నిర్వహించారు. దీంట్లో భాగంగా పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు ఎం.నాగ సత్య వెంకటరమణ, వుడా రామచంద్రరావు, చిట్టూరు వెంకటరావు, వనితా, నాగమణి, ముత్యాలశెట్టి, తీగల శ్రీను, ఆకుల పాపారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌టియుసి ఆధ్వర్యంలో ఉక్కునగరం అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వైకాపా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి హాజరయ్యారు. దీంట్లో భాగంగా నాగిరెడ్డి పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌టియుసి ప్రధాన కార్యదర్శిం ఎల్లుపోగుల మస్తానప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, ఈశ్వరరావు, అప్పలరాజు, రమణ, పరదేశి, అప్పారావు, పుల్లారావు, శ్రీనివాసరావు, బ్రహ్మాజీ, పిట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్మాణాల్లో ఫ్లైయాష్ ఇటుకలను వినియోగించాలి
* కలెక్టర్ ప్రవీణ్‌కుమార్

విశాఖపట్నం, మార్చి 16: కర్మాగారాల నుండి వెలువడే ఫ్లైయాష్‌ను ప్రభుత్వ నిర్మాణాల్లో, రహదారుల ఫిల్లింగ్స్‌లో వినియోగించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురువారం ఫ్లైయాష్ పై పవర్ ప్రాజెక్టుల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఫ్లైయాష్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ జీవిఎంసి, ఏపిఐఐసి, వుడా తరపున నిర్మాణాలకు అనుమతులను ఇచ్చేటపుడే ఫ్లైయాష్ ఇటుకలను తప్పక వాడాలని షరతులు పెట్టాలని కోరగా ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ పర్యావరణ శాఖాధికారులకు ఆదేశించారు. ఇటుక తయారీదారులకు ఫ్లైయాష్‌ను కర్మాగారాలే రవాణా చేసేలా చూడాలని ఇటుక తయారీదారుల సంఘం ప్రతినిధులు కోరారు. భవనాల బైలాస్‌లో చేర్చేందుకు ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఎన్విరాన్‌మెంటల్ ఇఇ ఆర్.లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ, స్టీల్ ప్లాంటు అధికారులు హాజరయ్యారు.