విశాఖ

మన్యం ఆశ్రమాల్లో మళ్లీ వార్డెన్ల వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మార్చి 19: విశాఖ మన్యంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలలో డిప్యూటీ వార్డెన్ల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేందుకు రంగం సిద్ధవౌతుంది. ఆశ్రమాల్లో వార్డెన్లను తొలగించడం వలన ఎదురవుతున్న ఇబ్బందులు, సంభవిస్తున్న విపత్కర పరిస్థితులను ఎట్టకేలకు గుర్తించిన ఐ.టి.డి.ఎ. అధికారులు వార్డెన్లను నియమించి పరిస్థితులను చక్కదిద్దాలని యోచిస్తున్నారు. అయితే ఈ సారి వార్డెన్ల నియామకంలో ఆశ్రమ పాఠశాలకు ఒకరే కాకుండా ఇద్దరు డిప్యూటీ వార్డెన్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఇద్దరు వార్డెన్లను నియమించి వీరిలో ఒకరికి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యతను అప్పగించాలని, మరొకరిని విద్యార్థుల బాగోగులను చూసుకునేందుకు నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మన్యం ఆశ్రమాల్లో వార్డెన్ల వ్యవస్థకు మళ్లీ జీవం పోసుకుంటుందని చెప్పవచ్చు. ఏజెన్సీలోని పదకొండు మండలాల పరిధిలో 122 ఆశ్రమ పాఠశాలలు పనిచేస్తుండగా వీటిలో దాదాపు 45 వేల మంది గిరిజన విద్యార్థులు ప్రాథమికోన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఆశ్రమాల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో ఆహారాన్ని అందించేందుకు గతంలో వార్డెన్లను నియమించగా, దీనిని పర్యవేక్షించే బాధ్యతను ఆయా ఆశ్రమ పాఠశాల ప్రదానోపాధ్యాయుడికి అప్పగించారు. అయితే ఆశ్రమాల్లో వార్డెన్లు అనేక అవతవకలకు పాల్పడుతూ విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడం లేదని భావించిన గత ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి హరినారాయణన్ వార్డెన్ల వ్యవస్థను రద్దు చేసారు. వార్డెన్ల బాధ్యతలను ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులకే అదనంగా అప్పగించారు. దీంతో ప్రదానోపాధ్యాయులు వారి విధి నిర్వహణను పక్కన పెట్టి వార్డెన్లగాఅదనపు బాధ్యతలు మోయాల్సి రావడంతో పనిభారం అధికమై పలు ఇబ్బందులకు దారితీసింది. విశాఖ మన్యంలో గత కొన్ని నెలలుగా ఆశ్రమ విద్యార్థులు వ్యాధుల బారిన పడి మృతి చెందుతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. ఆశ్రమాల్లో విద్యార్థుల వరుస మరణాల సంఘటనలు మన్యంలో పెద్ద దుమారమే లేపుతుండగా మరణాలు ఎందుకు సంబవిస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు వారి బాగోగులను చూసుకునే నాథుడు లేకపోవడంతో వ్యాధి ముదిరి మరణాల వరకు దారితీస్తుందని చెబుతున్నారు. గతంలో వార్డెన్లు ఉండేవారని, విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వారు తక్షణమే స్పందించి వైద్య సహాయం అందించేవారని, ప్రస్తుతం ప్రదానోపాధ్యాయులు ఇటువంటి పర్యవేక్షణ చేయకపోవడం వలనే వ్యాధులకు గురైన విద్యార్థులు మరణాలపాలవుతున్నారని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు వార్డెన్లు లేకపోవడం వలన ఎదురవుతున్న దుస్పరిణామాలను నివారించేందుకు గతంలో ఉన్న వార్డెన్ల వ్యవస్థను తిరిగి పునరుద్ధరిండమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఏజెన్సీలోని అన్ని ఆశ్రమాల్లో వార్డెన్ల నియామకానికి ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి చర్యలు ప్రారంభించారు. ఇందులోభాగంగా ఆశ్రమాల్లో వార్డెన్లను నియమించే దస్త్రాలను రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. అయితే మరో నెలలో విద్యా సంవత్సరం ముగుస్తుండడంతో ప్రస్తుతానికి అంతంతమాత్రంగానే వార్డెన్ల వ్యవస్థను అమలు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పకడ్బదీగా దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి ఆశ్రమానికి ఇకపై ఇద్దరు వార్డెన్లు ఉండనుండడంతో ఇకపై ఆశ్రమాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తినా వీరిని బాధ్యులు చేయాలని భావిస్తున్నారు. ఆశ్రమ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించకపోతే ఇందుకు సంబంధించిన వార్డెన్, అనారోగ్యానికి గురైనప్పుడు వారికి సకాలంలో వైద్య సేవలు అందించకపోతే మరో వార్డెన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఐ.టి.డి.ఎ. అధికారులు తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతవరకు సఫలీకృతవౌతాయో వేచిచూడాల్సిదే అయినప్పటికీ వార్డెన్లను నియమిస్తే విద్యార్థుల మరణాలు చాలావరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

నూకాంబిక మాలధారణ భక్తుల ఊరేగింపు
అనకాపల్లి, మార్చి 19: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి మాలాధారణ భక్తులు పట్టణ పురవీధుల గుండా భారీస్థాయిలో ఆదివారం ఊరేగింపు నిర్వహించారు. నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపును ఆలయ ఇవో సుజాత ప్రారంభించారు. ఎమ్మెల్యే పీలా తనయుడు శ్రీకాంత్ దంపతులు అమ్మవారి విగ్రహంతో ఊరేగింపులో పాల్గొన్నారు. నూకాంభిక మాలాదారణ భక్తులు శూలాలు దరించి ఈ ఊరేగింపులో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వివిధ కోలాటాలు, పులివేషాలు, నేలవేషాలు తదితర వేషధారణలతో పెద్ద జాతరను తలపించే రీతిలో నూకాంబిక అమ్మవారి ఊరేగింపు పురవీధుల మీదుగా సాగింది. అమ్మవారి మాలాధారణ భక్తులతోపాటు ఆలయ ట్రస్టీబోర్డు మాజీ చైర్మన్ మళ్లసురేంద్ర, బిఎస్‌ఎంకె జోగినాయుడు పలువురు దేశం నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ప్రసాద వితరణ జరిగింది.