విశాఖ

పోలీసులకు చిక్కిన దొంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), మార్చి 21: దొంగలించిన బంగారంతో పరారవుతున్న దొంగ పట్టణ పోలీసులకు బైపాస్ రోడ్డు నూకాంబిక ఆర్చి జంక్షన్ వద్ద మంగళవారం చిక్కాడు. ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలివి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామం కొప్పినీడ వారి వీధికి చెందిన కొప్పినీడి నాగదుర్గప్రసాద్(24) ఈనెల 17న స్థానిక ఉమ్మలాడ జంక్షన్ వద్ద విశాఖ నుండి నర్సాపురం వెళుతూ ముందుగా వెళుతున్న స్కూల్ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దుర్గాప్రసాద్‌ను చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. దుర్గాప్రసాద్ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ విదేశాలు వెళ్లేందుకు విశాఖపట్నం వన్‌టౌన్ ఏరియాలో హాస్టల్‌లో ఉంటూ వెల్డింగ్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాడు. మంగళవారం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన దుర్గాప్రసాద్ విశాఖపట్నంలో ఉన్న హాస్టల్ రూమ్‌కు వెళ్లి రూమ్‌లో దాచివుంచిన అరకిలో బంగారు నగలను పట్టుకుని విశాఖ నుండి అనకాపల్లి వరకు ఆటోలో వచ్చి ఇక్కడి నుండి లారీపై నర్సాపురం వెళ్లే ప్రయత్నంలో నూకాంబిక ఆర్చి సమీపంలో వేచి ఉన్నాడు. బంగారు నగలతో ఉన్న దుర్గాప్రసాద్ అక్కడ వేచి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, గోపాలరావు, శ్రీనివాసరావు ఇతర సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో బంగారు నగలు ఉన్నట్లుగా గుర్తించారు. గత ఏడాది నవంబర్‌లో పశ్చిమగోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలో బంగారు వ్యాపారి బవల్లాల్ జైన్ అనే వ్యక్తికి చెందిన ఇండికా కారులో నుండి ఈ నగలతోపాటు నగదును కూడా దుర్గాప్రసాద్‌తోపాటు మరో ఇద్దరు స్నేహితులు దొంగలించినట్లుగా నిందితుడు తెలిపారు. అయితే కారులో దొంగలించిన బంగారం ముగ్గురు వ్యక్తులు సరిసమానంగా పంచుకోగా దుర్గాప్రసాద్‌కు వచ్చిన వాటా అరకిలో బంగారం ఉందన్నారు. దుర్గాప్రసాద్‌కు వచ్చిన 22వేలు నగదుతో విశాఖ వచ్చి పాత బైక్ కొని ఆ బైక్‌పై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీటి విలువ సుమారు 17లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. దుర్గాప్రసాద్ తండ్రి, తమ్ముడులు తాపీమేస్ర్తిలుగా పనులు చేసుకుంటూ దుర్గాప్రసాద్‌ను బీటెక్ చదివిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

డిసిఎంఎస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలి
అనకాపల్లి(నెహ్రూచౌక్), మార్చి 21: ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న విశాఖపట్నం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీకి ఇకపై నుండి మంచిరోజులు వచ్చాయని సెంట్రల్ బ్యాంకు చైర్మన్ ఉప్పలపాటి సుకుమార వర్మ అన్నారు. స్థానిక డిసిఎంఎస్ కార్యాలయంలో మంగళవారం మహాజన సభ సమావేశం జరిగింది. ముందుగా డిసిఎంఎస్ సంస్థ వ్యవస్థాపకుడు దివంగత బొడ్డేడ అచ్చింనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిఎంఎస్ సంస్థ మేనేజర్ రామ్మోహనరావు తగ ఏడాది బడ్జెట్, వచ్చే ఏడాది అంచనా బడ్జెట్‌కు సంబంధించి బైలాను చదివి వినిపించారు. ముఖ్య అతిథిగా వచ్చిన సెంట్రల్ బ్యాంకు చైర్మన్ సుకుమార వర్మ మాట్లాడుతూ సంస్థకు సంబంధించి చోడవరంలో ఉన్న స్థలం వేలం వేయగా 3.49 లక్షలు వచ్చిందని సెంట్రల్ బ్యాంకులో చెల్లించవలసిన అప్పు 2.74లక్షలు జమచేయగా మిగతా నగదు 75లక్షలు రూపాయలు డిసిఎంఎస్ సంస్థ ఖాతాలో డిపాజిట్ చేసి ఉందన్నారు. జిల్లాలో ఉన్న పిఏసిఎస్ అధ్యక్షులు సంస్థ పాలకవర్గం సభ్యులు కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ఆ నిధులతో రైతులకు ఉపయోగపడే వ్యాపారాలు చేసి సంస్థకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నారు. సెంట్రల్ బ్యాంకు మాజీ చైర్మన్ చంటిబాబు రాజు మాట్లాడుతూ సంస్థకు చెందిన స్థలాల్లో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపం, కోల్డ్ స్టోరేజిలు నిర్మించినట్టు అయితే సంస్థకు మంచి ఆదాయం సమకూరుతుందని సూచించారు. సంస్థ చైర్మన్ ముక్కా మహాలక్ష్మినాయుడు మాట్లాడుతూ డిసిఎంఎస్‌కు గత వైభవానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన పిఏసిఎస్ అధ్యక్షుడు డిసిఎంఎస్ సంస్థను లాభాల బాటలో నడిపించడానికి వారివారి అభిప్రాయాలను తెలిపారు. అంనతరం సుకుమార వర్మను ఆ సంస్థ పాలకవర్గం సభ్యులు అధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అయినంపూడి బంగార్రాజు, బోడ నారాయణరావు, బండారు వెంకన్నపాత్రుడు, ఆర్‌ఎస్‌సిఎస్‌యల్ సన్యాసిరాజు, దండి సన్యాసయ్యదొర, ఆర్ రామకృష్ణరాజు, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్లు సిదిరెడ్డి శ్రీనువాసరావు, కాండ్రేగుల అప్పారావు పాల్గొన్నారు.