విశాఖ

కళ్లు తెరిచిన వుడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 15: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఎట్టకేలకు కళ్లు తెరిచింది. మూడు దశాబ్ధాల కిందట సేకరించిన భూమి కళ్లెదుటే ఆక్రమణలకు గురౌతున్నా పట్టించుకోని వుడా హఠాత్తుగా మేల్కొంది. మిగిలిన కొద్దిపాటి భూములనైనా దక్కించుకునేందుకు సిద్ధమైంది. భూమి చుట్టూ కంచె నిర్మించడం ద్వారా ఈ భూములు తమవేనన్న భావన కల్పించనుంది. అసలు విషయానికొస్తే వేపగుంట-సింహాచలం రహదారిని ఆనుకుని వుడా 1983లో 144 ఎకరాల భూమిని సేకరించింది. అప్పట్లో నగర శివారుగా ఉన్న ఈ ప్రాంతంలో లేఅవుట్‌లు వేసేందుకు భూముని సేకరించారు. అయితే ఈ ప్రాంతంలో భూములు రైతుల ఆధీనంలో ఉన్నప్పటికీ, వాస్తవానికి అవన్నీ సింహాచలం దేవస్థానానికి చెందినవే. దేవస్థానం నుంచి భూములను కౌలుకు తీసుకున్న రైతులు భూములపై పూర్తి హక్కులు తమవిగా భావించేవారు. ఎప్పుడైతే వుడా భూములను సేకరించిందో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే వేపగుంట గ్రామంలో వుడా సేకరించిన భూములకు సంబంధించి మూడు దశాబ్ధాల కిందటే అవార్డు ప్రకటించి, పరిహారం మొత్తం సుమారు రూ.32 లక్షలను కోర్టులో డిపాజిట్ చేసింది. తదనంతర పరిణామాల్లో పంచగ్రామాల్లో భూములకు సంబంధించి రెవెన్యూ శాఖ సర్వే నిర్వహించి, సింహాచలం దేవస్థానానికి పట్టాలు జారీ చేసింది. దీంతో భూములపై హక్కుల కోసం రైతులు, దేవస్థానానికి మధ్య న్యాయ పోరాటం మొదలైంది. ఇదిలా ఉండగా దేవస్థానాకి చెందిన భూములకు సంబంధించి రైతులకు కూడా హక్కు కల్పిస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసింది. అప్పటికే సాగులో ఉన్న రైతులకు మూడింట రెండు వంతులు, దేవస్థానానికి మూడింట ఒక వంతు చెందేట్టుగా జిఓలో పేర్కొంది. దీన్ని కూడా రైతులు అంగీకరించలేదు. పూర్తి హక్కులు తమకే ఉన్నట్టు భావించారు. అయితే భూములపై న్యాయస్థానం తీర్పు దేవస్థానానికి అనుకూలంగా రావడంతో రైతులు ఖంగుతిన్నారు. దీంతో వుడా సేకరించిన భూముల్లో జిరాయితీ, ఈనాం భూములకు మినహా మిగిలిన మొత్తం సింహాచలం దేవస్థానాకే చెందుతుంది. అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో దేవస్థానం మాత్రం ఊరటచెందుతోంది. ఎప్పుడో వుడా సేకరించిన భూములకు సంబంధించి పరిహారం తమకే దక్కుతుండగా, భూముల్లో చోటుచేసుకున్న ఆక్రమణలను తొలగించుకునే బాధ్యత వుడాపై పడింది.
ఇదిలా ఉండగా, వుడా సేకరించిన భూముల్లో ఇప్పటికే 40 నుంచి 50 ఎకరాల భూములు ఆక్రమణలకు గురైపోయాయి. ఆక్రమిత భూముల్లో పక్కా కట్టడాలు, భారీ భవంతులు వెలిశాయి. దీనిపై న్యాయస్థానంలో సైతం పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రైతులు మాత్రం భూములపై హక్కుల కోసం ఇంకా న్యాయ పోరాటం చేసేందుకు యత్నిస్తూనే ఉన్నారు.