విశాఖ

దోపిడీ దొంగల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మార్చి 26: డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో దొంగలు చెలరేగి పోతున్నారు. పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. పదవీ విరమణ చేసిన వయోవృద్ధులను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు దిగుతున్నారు. నెల రోజుల వ్యవధిలో మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడిన దొంగలు మూడు చోట్ల విశ్రాంత ఉన్నతాధికారుల ఇళ్ళనే ఎంచుకోవడం విశేషం. తాజాగా శనివారం అర్ధరాత్రి దొంగలు ఒక ఇంట్లో బీభత్సం సృష్టించారు. ఎలక్ట్రికల్ డి.ఇ.గా పదవీ విరమణ చేసిన మాతిరెడ్డి నాగన్న ఇంట్లో దొంగలు చొరబడి భార్య సన్యాసమ్మను కత్తితో గాయపరిచారు. నాగన్న పిల్లలు ఉద్యోగరీత్యా సుదూర ప్రాంతంలో ఉండడంతో ఆయన భార్యతో సహా శారదానగర్‌లో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి భోజనం అనంతరం దంపతులిద్దరూ నిద్ర పోయారు. రాత్రి 1 గంట సమయంలో ఇంటికి చుట్టూ ఉన్న తలుపులకు తాళాలు వేసి ఉండడంతో ఇంటి వెనుక వంట గది తలుపుల తాళాలు విరగొట్టి లోపలికి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు. వీరు నాగన్న దంపతులు పడుకున్న గదిలోకి ప్రవేశించగా గదిలో అలికిడి కావడంతో సన్యాసమ్మ లేచి ఎవరని ప్రశ్నించింది. అదే సమయంలో దొంగలు ఆమె నోరు నొక్కి కత్తితో బెదిరించారు. ఈ పెనుగులాటలో సన్యాసమ్మ చేతికి స్వల్ప గాయమైంది. అనంతరం మూడో వ్యక్తి నాగన్న వద్దకు వెళ్ళి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసేసుకున్నాడు. బంగారం, నగదు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. అరిస్తే చంపేస్తామని, బీరువా తాళాలు ఇవ్వాలని బెదిరించడంతో నాగన్న బీరువా తాళాలు ఇచ్చేసాడు. బీరువా తాళాలు తీసి బీరువాలో ఉన్న 15 తులాల బంగారం ఆభరణాలు, 70 తులాల వెండి, 10 వేల రూపాయల నగదును దొంగిలించుకుపోయారు. ప్రభుత్వ ఉన్నత్యోగిగా భారీగా ఆస్తులు సంపాదించావని, అవన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్పాలని దొంగలు నాగన్నపై వత్తిడి చేసారు. బీరువాలో ఉన్న వస్తువులు తప్పా తమ వద్ద ఇంకేమీ లేవని దంపతులు స్పష్టం చేసారు. దీంతో వారు దొంగిలించిన ఆభరణాలతో దొంగలు ఉడాయించారు. ఆదివారం ఉదయం ఎఎస్పీ ఐశ్వర్య రస్తోగి నాగన్న ఇంటిని సందర్శించి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో విచారణ చేపట్టారు. ఈసందర్భంగా నాగన్న మాట్లాడుతూ దొంగలు కత్తులతో బెదిరించడంతో ప్రాణ భయంతో వణికి పోయామన్నారు. ఏం చేస్తారోననే భయంతో తాళాలు ఇచ్చేమన్నారు. దొంగలు వెళ్ళిపోయిన తరువాత పట్టణ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసినా ఎవ్వరూ స్పందించలేదని వాపోయారు. చివరకు 100 నెంబర్‌కు ఫోన్‌చేసి చోరీ జరిగిన సమాచారాన్ని తెలియజేసామన్నారు.
* మానవత్వం చూపిన దొంగలు
నాగన్న ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు భార్యసన్యాసమ్మకు చెందిన మంగళ సూత్రాలను దొంగిలించారు. దొంగలు వెళ్ళిపోతున్న సమయంలో సన్యాసమ్మ మొత్తం ఆభరణాలు పట్టుకుపోయినా మంగళసూత్రాలు మాత్రం ఇచ్చేయాలని దొంగలను ప్రాదేయపడింది. దీంతో దొంగలు సన్యాసమ్మ మంగళ సూత్రాలను ఆమెకు ఇచ్చేసి మిగిలిన ఆభరణాలను పట్టుకుని పోయారు. బాధితుడు నాగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల మొదటి వారంలో శనివారం చోరీ జరిగిన ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో దొంగలు పడి చోరీకి పాల్పడ్డారు. పెదబొడ్డేపల్లిలో కూడా ఇదే తీరున పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. వరుసగా దొంగతనాలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.