విశాఖపట్నం

ఎయు భూములకు రక్షణ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: ఆంధ్రా యూనివర్శిటీకి నగర పరిధిలో చాలా విలువైన భూములు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పరిరక్షణ తదితర బాధ్యతలు చూసుకునేందుకు ఎస్టేట్ ఆఫీసర్ ఎయుకి లేకపోవడం శోనీయమని ఆదివారం జరిగిన సెనేట్ సమావేశంలో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ ఎస్టేట్ ఆఫీసర్ లేకపోవడం వలన ఎయు అధికారులు ఈ భూముల పరిస్థితిని పెద్దగా పట్టించుకోపోవడం వలన భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని సభ్యులు అన్నారు. వెంటనే ఎస్టేట్ ఆఫీసర్‌ను నియమించాలని సభ్యుడు ఓ నరేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఆంధ్రా యూనివర్శిటీలో ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉందని అన్నారు. ఎయులో ఉన్న కోర్సులు, విద్యార్థులకు అనుగుణంగా ప్రొఫెసర్లు లేకపోవడం దురదృష్టకరమని సభ్యులు అన్నారు. ఇప్పుడున్న విద్యార్థుల సంఖ్యతో పోల్చి చూస్తే 60 శాతం ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని వెంటనే భర్తీ చేయాలని సభ్యులు సూచించారు. కొత్త కోర్సులు ప్రవేశపెట్టినా, వాటిని బోధించేందుకు ప్రొఫెసర్లు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. దీనివలన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తరగతులు లేక విద్యార్థులు వర్శిటీకే రావడం మానేస్తున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.
రక్షణ రంగాల్లో పనిచేస్తూ మూడేళ్ళ అనుభవం కలిగిన వారికి ఇంజనీరింగ్‌లో ఈవినింగ్ కోర్సుల నిర్వహణకు అవకాశం కల్పించాలని సెనెట్ సమావేశం నిర్ణయించింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో 60 మంది వంతున ప్రవేశం కల్పించనున్నారు. ఎయిర్ ఫోర్స్‌తో ఎంఓయు చేసుకోవడానికి సెనెట్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఏయు దూరవిద్య కేంద్రంలో బిఎస్సీ (కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) కోర్సును నిర్వహించాలని నిర్ణయించారు. సైకాలజీలో చేరే విద్యార్థులకు ఎమ్మెల్సీ సైకాలజీ డిగ్రీని అందించాలని, సైకాలజీ విభాగాన్ని సైన్స్ కళాశాల పరిధిలోకి మార్చాలని నిర్ణయించారు. ముందుగా అకడమిక్ సెనేట్ పూర్వ సభ్యులు ఆచార్య పి.ఆపదరావు మరణానికి సభ సంతాపం తెలియజేసింది. రెండు నిమిషాలు వౌనం పాటించారు. 2016-17 ఆర్ధిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌ను, 2017-18 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదిత బడ్జెట్‌ను సభ్యుల ముందుంచి ఆమోదం తీసుకున్నారు. ప్రభుత్వం నియమించిన రేషనలైజేషన్ కమిటి సూచనలను సెనెట్ ఆమోదించింది. మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాన్ని కంప్యూటర్ సైన్స్, సిస్టమ్స్ ఇంజనీరింగ్‌గా మార్పు చేశారు. ఎమ్మెస్సీ హార్టీకల్చర్ కోర్సులో కిచెన్ గార్డెన్‌ను అంశంగా చేర్చడంపట్ల సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. సిలబస్ రూపకల్పన బాగుందని కితాబినిచ్చారు. ప్రొఫెషనల్ యూజీ కోర్సులకు ప్రస్తుతం అనుసరిస్తున్న సింగిల్ వేల్యుయేషన్ స్థానంలో డబుల్ వేల్యుయేషన్ చేయాలని సెనేట్ సభ్యుల నిర్ణయించారు. పారదర్శకత, నాణ్యత పెంపొందించడంలో భాగంగా రెండుసార్లు మూల్యాంకనం చేయాలని ప్రతిపాదన చేసినట్టు వీసీ వివరించారు. నావికాదళంలో పనిచేసే పెట్టీ ఆఫీసర్, చీఫ్ పెట్టీ ఆఫీసర్లకు మేనేజ్‌మెంట్ కోర్సులను అందించడానికి అవసరమైన విధివిధానారల రూపకల్పనకు కమిటి వేయాలన్నారు. ఐదేళ్ళ సమీకృత అర్ధశాస్త్ర కోర్సును ఏడాదికాలం ప్రవేశాలు నిలిపివేయాలని సెనేట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఎంఫిఎల్, పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు బోర్డ్ ఆఫ్ రీసెర్చ్ స్టడీస్ సిఫారుసులకు సభ్యులు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, మాజీ వీసీలు ఆచార్య కోనేరు రామకృష్ణారావు, ఆచార్య కెవి రమణ, ఆచార్య జిఎస్‌ఎన్ రాజు, మాజీ రెక్టార్ ఆచార్య ఇఏ నారాయణ, మాజీ రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, పాలకమండలి సభ్యులు ఆచార్య జి.శశిభూషణరావు, ఆచార్యర ఎం.ప్రసాదరావు, ఆచార్య ఎన్.బాలయ్యర, సింబయాసిస్ సిఇఓ ఓరుగంటి నరేష్‌కుమార్, కుమార్‌ర రాజా, డాక్టర్ ఎస్‌వి ఆదినారాయణ, టి.బలరామకృష్ణ ప్రిన్సిపాల్స్, అడకమిక్ డీన్, ఫైనాన్స్ అధికారి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అకడమిక్ సెనేట్ సభ్యులు పాల్గొన్నారు.