విశాఖపట్నం

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో స్వచ్ఛ్భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: ఆర్టీసీ విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ ద్వారకా బస్‌స్టేషన్ ఆవరణలో కల్కి మానవ సేవా సమితి, ఆర్టీసీ సంయుక్తంగా స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని చేపట్టాయి. కల్కి మానవ సేవా సమితి సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది కలిసి ద్వారకాబస్‌స్టేషన్ ఆవరణ మొత్తం శుభ్రపర్చారు. చెత్త, చిత్తకాగితాలు, ప్లాస్టిక్, వ్యర్థపదార్థాలను తొలగించి, రోడ్లను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (విశాఖపట్నం) ఏ.అప్పలరాజు, డిప్యూటీ సిఎంఇ (యు) జి.సత్యనారాయణ, డిప్యూటీ సిటిఎం (విశాఖపట్నం) సిహెచ్.అప్పలనారాయణ, అధికారులు, యూనియన్ నాయకులు పిపిఎం రాజు, జెఎం నాయుడు, సూపర్‌వైజర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, కల్కిమానవ సేవా సమితి కార్యదర్శి జగన్నాధం, అధ్యక్షులు వెంకటరత్నం,్భక్త బృందం పాల్గొన్నారు.
సాంకేతికతతో వ్యవసాయ రంగం అభివృద్ధి
జగదాంబ, మార్చి 26: వ్యవసాయ రంగానికి ఐఓటి సాంకేతికతను అనుసంధానించడం ద్వారా ఉత్పత్తిని పెంపొందించాలని ఎయు ఇంజనీరింగ్ కళాశాల వైస్-ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.ఎస్. ప్రసాదబాబు అన్నారు. అదివారం ఏయూ ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో నిర్వహించిన ‘అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటి సెన్సార్ ఎనాబ్లిమెంట్’ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 2050 నాటికి వ్యవసాయ ఉత్పత్తిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని దీనికి అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విభాగాధిపతి ఆచార్య డివి రామకోటిరెడ్డి మాట్లాడుతూ సెన్సార్‌లను ఐఓటి సాంకేతికతతో అనుసంధానించడంపై ప్రత్యక్ష శిక్షణ అందించడం జరిగిందన్నారు. విద్యార్థులు ప్రత్యక్షంగా నేర్చుకోవడం వలన మెరుగైన అవగాహన కలుగుతుందన్నారు. త్వరలో 100 మందితో 16 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇటువంటి సదస్సులు ప్రేరణగా నిలుస్తాయన్నారు. నేరాల నియంత్రణ, కాలుష్యం పెరుగుదలను గుర్తించి హెచ్చరించడానికి, ఇంటలెక్చువల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం రూపకల్పనకు యువత పనిచేయాలన్నారు. అన్ని రంగాలు ఐఓటి దిశగా పయనిస్తున్నాయని, ఐఓటి భవిష్యత్‌లో కీలకంగా మారుతుందన్నారు. ఈసిఇ విభాగాధిపతి ఆచార్య పి.రాజేష్‌కుమార్ మాట్లాడుతూ తమ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇటువంటి సదస్సులు ఉపకరిస్తాయన్నారు. నిపుణుల నుంచి జ్ఞానాన్ని పొందడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలన్నారు. సదస్సు కన్వీనర్ ఆచార్య పి.స్వప్న మాట్లాడుతూ విద్యార్థులను 25 సమూహాలుగా విభజించి ప్రత్యక్ష శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. నూతన అంశాల ఆవిష్కరణ దిశగా సాంకేతికతను వినియోగించాలన్నారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ప్రధానం చేశారు.