విశాఖపట్నం

వాడివేడిగా జెడ్పీ స్థారుూ సంఘ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, మార్చి 26: జిల్లాలో రాజీవ్ విద్యామిషన్ అధికారుల తీరు, వారు చేస్తున్న పనులు ఎవరికి తెలియకుండానే ఉన్నాయని గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని, ఆర్‌విఎంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ నిర్వహించాలని, స్థారుూ సంఘ సభ్యులు దాడి లక్ష్మీసత్యనారాయణ అన్నారు. ఆదివారం జెడ్‌పిలో చైర్‌పర్సన్ లాలం భవానీభాస్కర్, సిఇఓ జయప్రకాశ్‌నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సారుూ సంఘాల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముందుగా డిఆర్‌డిఏ, డ్వామా, హౌసింగ్, ఎస్సీ, బిసి కార్పొరేషన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పుకొచ్చారు. రాజీవ్ విద్యామిషన్‌లో 800 వంటశాలలకుగాను కేవలం 330 మాత్రమే నిర్మించారని, మిగిలినవి ఎపుడు పూర్తిచేస్తారని, ఏ సమావేశాలకూ ప్రాజెక్టు అధికారి రాకపోతే ఎలా అని సభ్యులు ప్రశ్నించారు. ఈ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పూర్తి నివేదికలతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేస్తామన్నారు. అలాగే విద్యార్థులకు అందించిన యూనిఫారం ఇచ్చిన రెండు రోజులకే కుట్టులు ఊడిపోతున్నాయని, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న కస్తూరిభా పాఠశాలలు, ప్రత్యేక పాఠశాలలకు ఎంత నిధులు వస్తున్నాయి? ఏ విధంగా వీటిని ఖర్చు చేస్తున్నారు? అనే విషయాలపై సరైన సమాధానం రావడంలేదన్నారు.
టిబి ఆసుపత్రిలో ఇష్టానుసార
విధులపై మండిపాటు
నగరంలో పెదవాల్తేరులో ఉన్న టిబి ఆసుపత్రిలో సిబ్బంది ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని జెడ్‌పిటిసి సభ్యులు ఆసుపత్రి ఆర్‌ఎంఓను ప్రశ్నించారు. టిబి ఆసుపత్రి నుంచి కెజిహెచ్‌కు రక్తపరీక్షలు తదితర పరీక్షల నిమిత్తం రోగులను తరలించే విధానంలో జాప్యం జరగడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సభ్యులు హెచ్చరించారు. అలాగే ఆసుపత్రిలో కార్యాలయ ఉద్యోగులు పలువురు నాల్గో తరగతి సిబ్బందికి ఒకేవిధమైన డ్యూటీలు వేస్తున్నారని, షిప్ట్ డ్యూటీలు ఎందుకు వేయడంలేదని అందరికీ రోష్టర్ విధానాన్ని అమలు చేయాలని, లేకుంటే ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని నర్సింగ్ సూపరింటెండెంట్‌పై పలు ఫిర్యాదులు వస్తున్నాయని పనితీరు మారకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై ఆసుపత్రి ఆర్‌ఎంఓ శైలజ మాట్లాడుతూ ఆసుపత్రిలో కొన్ని పరికరాలు మరమ్మతులకు గురయ్యాయని, దీనికి సంబంధించి డిఎంఇకి లేఖ రాసామని, డ్యూటీల విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అలాగే వైద్య,ఆరోగ్యశాఖకు సంబందించి జిల్లావ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ వైద్యసేవలు కింద ఏఏ వ్యాధులకు ఏఏ ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నారో తెలియడంలేదని, గ్రామాల్లో వ్యాక్సిన్ కొరత వలన పిల్లలకు వ్యాక్సిన్‌ను వేసేందుకు పట్టణాలకు తీసుకురావాల్సి వస్తుందని, దీనిపై చర్యలు చేపట్టాలని గొలుగొండ జెడ్‌పిటీసి తారక వేణుగోపాల్ అధికారులను ప్రశ్నించారు. ఈ విషయంపై డిఎంహెచ్‌ఓ సరోజని మాట్లాడుతూ ఆసుపత్రులు, వ్యాధుల జాబితాను సభ్యులందరికీ తెలియజేస్తామని, వ్యాక్సిన్ అందించే విషయంలో లోటుపాట్లు ఉంటే సరిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏప్రిల్ ఆరో తేదీ వరకు ప్రీమియం చెల్లించేందుకు గడువు ఉందన్నారు.
సంక్షేమ పథకాల్లో అమల్లో పారదర్శకత
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని జెడ్‌పి చైర్‌పర్సన్ లాలం భవానీ భాస్కర్ సూచించారు. ఆర్టీసీ, ఐసిడిఎస్, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై లోతుగా చర్చ జరిగింది. అలాగే గ్రామీణ నీటి సరఫరా పథకంలో చర్చల్లో భాగంగా పలు నూతన పథకాలకు ప్రతిపాదనలు పంపుతున్నామని, ఈ విషయంపై ప్రజాప్రతినిధి తెలియజేయడంలేదని ఈఏపీ పథకం కింద రూ.15 కోట్లతో ప్రతిపాదనలు పంపారని ఆ సమాచారాన్ని కనీసం ఎమ్మెల్యేలకు తెలియజేయకపోవడం సరికాదని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు నిలదీశారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ ప్రసాద్ మాట్లాడుతూ అందరికీ సకాలంలో తెలియజేస్తామన్నారు. అంగన్‌వాడీ వర్క్‌ర్లు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు ఖాళీలు జిల్లాలో సుమారు 630 పోస్టులు ఉన్నాయని, పక్క జిల్లాల్లో విజయవంతంగా భర్తీ చేసినప్పటికీ విశాఖలో రిజర్వేషన్ అమలుపై స్పష్టమైన ఆదేశాలున్నా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై స్ర్తి,శిశు సంక్షేమశాఖామంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయాలని సిఇఓ సూచించారు.