విశాఖపట్నం

ఎయిరిండియా నైట్ పార్కింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ర్షాకాలం వచ్చిందంటే, చేపల చెరువును తలపించే ఒకప్పుటి విశాఖ విమానాశ్రయం సమస్యలన్నింటినీ అధిగమించి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుకుని నిలబడింది. దేశంలోని పేరెన్నికగన్న విమానాశ్రయాల సరసన నిలిచిన విశాఖ విమానాశ్రయంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి, నైట్ పార్కింగ్ సౌకర్యం కల్పించారు. పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చొరవతో ఆంధ్ర ప్రదేశ్‌లో తొలి నైట్ పార్కింగ్ విమానాశ్రయంగా విశాఖ విమానాశ్రయం గుర్తింపు తెచ్చుకుంది. గడచిన నాలుగు సంవత్సరాల కిందట విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనువగా మారింది. ప్రస్తుతం సింగపూర్, దుబాయ్, మలేషియా తదితర దేశాలకు విశాఖ నుంచి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వచ్చే నెల నుంచి కొలంబోకు కూడా కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖను ఇండిగో హబ్‌గా మార్చాలన్న ఆలోచన ఆ విమానయాన సంస్థకు వచ్చింది. కారణాలేంటో తెలియదు కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఎయిర్ ఇండియా హబ్‌గా విశాఖ విమానాశ్రయాన్ని మార్చేందుకు తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎయిర్ ఇండియా విమానం విశాఖ విమానాశ్రయంలో నైట్ పార్కింగ్ చేయబోతోంది. తెల్లవారు జామునే ఈ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల్లో నైట్ పార్కింగ్ కలిగిన విమానాశ్రయంగా విశాఖ విమానాశ్రయం గుర్తింపు తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే, షంషాబాద్ ఎయిర్‌పోర్టు తరువాత విశాఖ ఎయిర్‌పోర్టే నైట్ పార్కింగ్ సౌకర్యం కలిగి ఉంది. ఈ విమానం ఇక్కడి నుంచి విజయవాడ తిరుపతి, భువనేశ్వర్, రాయపూర్, హైదరాబాద్‌లకు సర్వీసులను నడపనుంది. కేవలం ఒకే ఒక్క విమానం ఒక రోజులో మూడు రాష్ట్రాలకు కనెక్టివిటీ కల్పించడం గమనార్హం. ఈ విమానం విశాఖ నుంచి ఉదయం 6.30గంటలకు బయల్దేరి విజయవాడ మీదుగా తొమ్మిది గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 9.25 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి విజయవాడ మీదుగా 11.55 గంటలకు తిరిగి విశాఖకు వస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి 1.50 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరి 3.55 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. సాయంత్రం 4.35 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి సాయంత్రం ఆరు గంటలకు రాయపూర్ చేరుకుంటుంది. 6.25 గంటలకు రాయపూర్ నుంచి బయల్దేరి రాత్రికి విశాఖకు చేరుకుంటుంది. ఈ సర్వీసులు బుధవారం మినహా, మిగిలిన అన్ని రోజుల్లోను నడుస్తాయి. బుధవారం మాత్రం ఉదయం 10.45 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి విజయవాడ మీదుగా మధ్యాహ్నం 1.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. తిరిగి అదే రోజు రాత్రి విశాఖ విశాఖకు చేరుకుంటుంది.