విశాఖ

ఆదాయం తక్కువ.. వ్యయం ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 28: చెప్పుకోడానికి మహా విశాఖ నగరపాలక సంస్థ.. తరచి చూస్తే, అంతా డొల్లే.. నగరంలో ఒకటి, రెండు ప్రదేశాలు తప్ప, మిగిలిన నగర మంతా పందులు, చెత్తా చెదారంతో కంపుకొడుతోంది. నగరంలో గడచిన సంవత్సర కాలంగా చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా జరిగిన దాఖలాలు లేవు. ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న జివిఎంసి పనులు చేయడానికి మాత్రం చేతిలో చిల్లిగవ్వకూడా లేదంటోంది. అభివృద్ధి గురించి అడిగితే అప్పులు వల్లెవేస్తున్నారు. అసలు విషయానికి వస్తే, జివిఎంసి ఆదాయం కన్నా.. వ్యయం అధికంగా కనిపిస్తోంది. జివిఎంసి తలమీద సుమారు 419 కోట్ల రుణ భారం ఉంటే ఇందులో కేవలం 70 కోట్ల రూపాయలను మాత్రమే తగ్గించుకోగలిగింది. దీనంతటికి కారణం జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకమే. లేనిపోని ఆర్భాటాలకు పోయి జివిఎంసి ఈ పథకాన్ని కొని తెచ్చుకుంది. దీనివలనే వందల కోట్ల రూపాయలు అప్పులపాలైపోయింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో జివిఎంసి పరిధిలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలవైన 21 ప్రాజెక్ట్‌లను జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద చేపట్టారు. ఇందులో 425 కోట్లతో బిఆర్‌టిఎస్ రోడ్ల పనులు, 244 కోట్లతో భూగర్భ డ్రైనేజ్‌లు, 600 కోట్లతో తాగునీటి పథకాలను చేపట్టారు. ఈ పనులు చేపట్టడానికి కేంద్రం 50 శాతం నిధులిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, జివిఎంసి 30 శాతం మ్యాచింగ్ గ్రాంట్ కింద చెల్లించాల్సి ఉంది. ఈ మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించడం కోసం జివిఎంసి పడరాని పాట్లు పడుతూ వచ్చింది. చివరకు సిబ్బంది జీతాలు, వివిధ బిల్లులు చెల్లించడానికి వివిధ సంస్థలు, బ్యాంకుల వద్ద సుమారు 419 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఆనాడు తీసుకున్న రుణానికి నెలకు ఐదు కోట్ల రూపాయలు కేవలం వడ్డీ రూపంలోనె చెల్లిస్తూ వస్తోంది. ముంబైలోని ఎల్‌ఐసి బ్రాంచ్ ద్వారా 70 కోట్ల రూపాయల రుణం తీసుకుని దాదాపూ దాన్ని తీర్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 89.67 కోట్ల రుణాన్ని 2010లో తీసుకుంది. దీన్ని 2025లోగా తీర్చాల్సి ఉంది. హైదరాబాద్‌లోని దర్శ నుంచి 30 కోట్లు 2016లో రుణం తీసుకుంది. దీన్ని 2018లోగా చెల్లించాల్సి ఉంది. అలాగే హడ్కో నుంచి 2013లో 100 కోట్ల రూపాయలు తీసుకుంది. దీన్ని 2025లోగా చెల్లించాలి. అదేవిధంగా 2014లో 70 కోట్ల రుణం తీసుకుంది. ఇది 2027లో తీర్చాల్సి ఉంది. హడ్కో నుంచి 2015లో మరో 60 కోట్ల రుణం తీసుకుంది. దీన్ని 2029లోగా తీర్చాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి రావల్సిన బకాయిలు రాకపోవడం, ఆదాయం ఏమాత్రం పెరగకపోవడంతో జివిఎంసి రానున్న రోజుల్లో ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది.