విశాఖ

రెండున్నర దశాబ్దాలుగా భర్తీకి నోచుకోని క్రాఫ్ట్, ఆర్ట్స్, పిఇటి పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 15: రాష్ట్ర ప్రభుత్వం క్రీడావిధానానికి రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో చాలాకాలంగా భర్తీ కాకుండా ఉన్న ఆర్ట్స్, క్రాఫ్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ అంశం తెరపైకి వస్తోంది. విద్యార్థుల మార్కుల జాబితాతో పాటు ఎక్స్‌ట్రా కర్రిక్యులర్ యాక్టివిటీస్ (అదనపు బోధనా ప్రణాళిక)కు సంబంధించిన షీట్ అందచేస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకటించడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో రెండున్నర దశాబ్దాలుగా ఆర్ట్స్, క్రాఫ్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. విద్యార్థిని పరిపూర్ణంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర వహించే ఈ ఉపాధ్యాయుల నియామకంపై ప్రభుత్వం శీతకన్ను వేసిందనవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు బోధనా ప్రణాళిక (ఎక్స్‌ట్రా కర్రిక్యులర్ యాక్టివిటీస్) కింద ఆర్ట్స్, క్రాఫ్ట్, పిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమించేది. పాఠ్యాంశాలతో పాటు బోధనేతర అంశాలైన డ్రాయింగ్, మ్యూజిక్, బొమ్మల తయారీ, వ్యాయామం, క్రీడలు తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చి విద్యార్థుల మనోవికాసానికి వీలుగా ఈ అంశాలకు సంబంధించి ఉపాధ్యాయులను గతంలో నియమించేవారు. అయితే 1989 నుంచి ఆర్ట్స్, క్రాఫ్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియమకాలను నిలిపివేశారు. ఆ తరువాతి కాలంలో డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలను కేవలం కోర్ సబ్జెక్టులకే పరిమితం చేశారు. దీంతో ఈ కేటగిరిల్లో ఉపాధ్యాయుల నియామకం జరగడం లేదు. రాష్ట్రంలో 678 డ్రాయింగ్ టీచర్ల పోస్టులు, 430 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులు, 766 క్రాఫ్ట్ టీచర్ల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. 250 మంది విద్యార్థులు ఉన్న చోట ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ను నియమించాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే వీటిని పాఠశాలల్లో పాటించిన దాఖలాలు లేవు. చాలా పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు లేరు. క్రాఫ్ట్, డ్రాయింగ్ పీరియడ్లు దాదాపు స్టడీఅవర్స్‌గా మారిపోయాయి. ప్రైవేట్ పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ లేక ఈ మూడు కేటగిరీల కింద టీచర్ల నియమకాలు అస్సలు ఉండటం లేదు. తల్లిదండ్రులు కూడా ఈ విషయమై యాజమాన్యాలను ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆటపాటల కన్నా చదువే ముఖ్యమని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుండటంతో ప్రైవేట్ పాఠశాలల్లో ఈ అంశం గురించి పట్టించుకునే వారే లేరు. అదనపు బోధనేత ప్రణాళికకు సంబంధించి జారీ చేసే షీట్ ఆధారంగా తదుపరి విద్య కొనసాగింపులో, ఉద్యోగావకాశాల్లో వెయిటేజ్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆయా కేటగిరీల ఉపాధ్యాయులను నియమించకుండా అది ఎలా సాధ్యమవుతుందని ఉపాధ్యాయవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయు సంఘాలు కోరుతున్నాయి.