విశాఖపట్నం

కలెక్షన్ అదరహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, మార్చి 30: జీవిఎంసి ఆదాయపన్ను ద్వారా వచ్చే వసూళ్ళు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ ఏడాది రూ.208 కోట్లు వసూళ్ళు చేయాల్సి ఉండగా, ఇందులో గురువారం నాటికి రూ.193కోట్లకు చేరుకుంది. అయితే ఈ ఒక్కరోజే నాలుగు కోట్ల మేర వసూలైందని జీవిఎంసి రెవెన్యూ అధికారి రవీంద్ర తెలిపారు. అయితే పన్ను చెల్లించేందుకు జీవిఎంసి ఒక్కరోజే గడువు ఉంది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి నూతన పన్నులు చెల్లించేందుకు అవకాశం ఉండటంతో వినియోగదారులంతా పన్నులు చెల్లించేందుకు మీ సేవా కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. అలాగే జీవిఎంసికి పలు ప్రభుత్వ, ప్రైవేటురంగాల నుంచి రావాల్సిన బకాయి పన్నులు కోట్లలో ఉండటంతోపాటు పలు కోర్టు కేసులు సైతం వేధించడంతో జీవిఎంసి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది. అయితే కమిషనర్ హరినారాయణ్ ఆదేశాలు మేరకు రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి తిరిగి పన్ను వసూళ్ళుకు చర్యలు చేపడుతున్నారు.

నేడు లాటరీ
* మద్యం దుకాణాలకు
5370 దరఖాస్తులు
* ఐదు దుకాణాలకు దరఖాస్తులు నిల్

విశాఖపట్నం, మార్చి 30: మద్యం దుకాణాల కొత్త లైసెన్స్‌లకు దరఖాస్తులు చేసుకునే సమయం గురువారం రాత్రి ఎనిమిది గంటలతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 401 దుకాణాలకు 5,370 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ డిసి గోపాలకృష్ణ తెలియచేశారు. జివిఎంసి పరిధిలోని 154 దుకాణాలకు 1085 దరఖాస్తులు వచ్చాయి. గాజువాక పరిధిలోని 54 దుకాణాలకు 693 దరఖాస్తులు వచ్చాయి. అనకాపల్లి సర్కిల్‌లో 3592 దరఖాస్తులు అందాయి. రూరల్ జిల్లాలో ఐదు దుకాణాలకు దరఖాస్తులు రాలేదని డిసి తెలియచేశారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎయు కాన్వొకేషన్ హాలులో మద్యం దుకాణాలకు లాటరీ తీస్తారని గోపాలకృష్ణ తెలియచేశారు.