విశాఖ

ఎండ తీవ్రతతో ప్రజలు విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఏప్రిల్ 17: అరకులోయలో ఆదివారం భానుడు భగభగమంటూ నిప్పులు చెరిగాడు. భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు విలవిల్లాడిపోయారు. ఎండ వేడిమి పెరిగిపోవడంతో అరకులోయ వాసులతో పాటు పర్యాటకులు బెంబేలెత్తిపోయా రు. ఎండతీవ్రతకు పట్టణంలోని ప్రధా న రహదారులపై జనసంచారం పలుచబడింది. నిత్యం జనం తాకిడితో సందడిగా ఉండే దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడళ్లు నిర్మానుష్యమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు సాహసం చేయలేకపోయారు. ఎండ తీవ్రతకు జనసంచారం తగ్గడంతో ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం తలపించింది. ఇక గిరిజన గ్రామాల పరిస్థితి కూడా ఈవిధంగానే ఉంది. ఎండ వేడిమి, ఉక్కబోతను స్థానికులతో పాటు పర్యాటకులు, వృద్ధులు, పిల్లలు తాళలేకపోతున్నారు. ఎండ బారిన పడకుండా ఉండేందుకు పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చా లామంది తప్పనిసరి పరిస్థితుల్లో కష్టం మీద రాకపోకలు సాగిస్తున్నారు. యువతీ, యువకులు సూర్యుడి ప్రతాపానికి గొడుగులు, చున్నీలు వేసుకుం టూ ముందు జాగ్రత్త పడుతున్నారు. వడగాల్పులకు ఉపాధిహామీ పథకం కూలీలు గురవుతూ పొట్టకూటి కోసం కూలి పనులు చేయక తప్పడం లేదు. రాబోయే రోజుల్లో ఇదే మాదిరిగా చంఢ ప్రచండుడు తన ప్రతాపాన్ని చూపితే పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.