విశాఖపట్నం

పోలియో రహితంగా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 2 : రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చినవాల్తేరులో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో 4.46 లక్షల మంది చిన్నారులు ఉండగా, వీరందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలో 2.1 లక్షల మందితో పాటు గిరిజన ప్రాంతాల్లో 80,592 మందికి, జివిఎంసి పరిధిలో 1.39 లక్షల మందికి పోలియో చుక్కలు వేసినట్టు తెలిపారు. దీనికోసం 3,786 బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే బూత్‌లకు రాకుండా మిగిలిన వారిని గుర్తించి, వారిక కూడా చుక్కలు వేసేందుకు 7,572 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 22,641 మందిని హైరిస్క్ బాలలుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమానికి 15,144 మంది వాక్సినేటర్లను వినియోగించామన్నారు. కార్యక్రమంలో జివిఎంసి ఇన్‌ఛార్జ్ కమిషనర్ బాబూరావు నాయుడు, డిఎంహెచ్‌ఓ డాక్టర్ సరోజిని, సిఎంఓ డాక్టర్ హేమంత్, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.