విశాఖపట్నం

జివిఎంసి ఎన్నికలకు ఇదే మంచి తరుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప దేళ్లకు పైగా పాలకవర్గం లేకుండా, ప్రత్యేకాధికారి పాలనలో కొనసాగుతున్న గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థకు ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగతాయా? అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. జివిఎంసి ఎన్నికల కోసం ఐదేళ్ల నుంచి మాజీ కార్పొరేటర్లు, మేయర్ పదవిని ఆశిస్తున్న వారు ఆయా పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి నుంచి స్పందన లేకపోవడంతో అధికార పార్టీ నేతలు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అధికార పార్టీకి ప్రజల్లో అసంతృప్తి ఉందని, దాన్ని ఎదుర్కొనే సత్తా లేకనే చంద్రబాబు మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరపడం లేదని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యంత బలమైన పిడిఎఫ్ అభ్యర్థిని ఓడించి, ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల స్థానాన్ని టిడిపి, బిజెపిలు దక్కించుకున్నాయి. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ తెలిసిన నాయకులు, సమైక్యంగా పని చేయడం వలన ఈ ఎన్నికలో టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించారన్నది వాస్తవం. ఇదే స్ఫూర్తితో జివిఎంసి ఎన్నికలను నిర్వహించలేరా? ఇందుకు శ్రేణులు సిద్ధంగా ఉన్నా, నేతలు మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రత్యక్ష పద్ధతి ద్వారానే మేయర్‌ను ఎన్నుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. ఒకవేళ ఫలితాలు తారుమారైతే, మేయర్ ప్రతిపక్షం చేతుల్లోకి వెళితే, పరువు పోతుందని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అయితే, జివిఎంసి పరిధిలో ఎనిమిది మంది టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇద్దరు ఎంపిలు ఉన్నారు. వెరసి 13 మంది ఎక్స్‌అఫిషియో ఓట్లు ఉంటాయి. పరోక్ష పద్ధతిన మేయర్‌ను ఎన్నుకో వలసి వస్తే, ఖాయంగా 12 ఓట్లు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఒక రాజ్యసభ, వైకాపాకు ఒక రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఈ లెక్కన అధికార పార్టీ ఇప్పటికే కొంత బలాన్ని సమీకరించుకుంది. మరో విషయం ఏంటంటే, తిరుపతి కార్పొరేషన్ టిడిపికి అనుకూలంగా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్ కూడా టిడిపికి అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోక్క హుదూద్ తుపాను తరువాత విశాఖను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత టిడిపికి దక్కింది. అలాగే మిత్రపక్షమైన బిజెపి ఎమ్మెల్సీ పదవిని గెలుచుకుని, విజయ దరహాసంతో ఉంది. జివిఎంసి ఎన్నికల నాటికి తమ బలాన్ని పెంచుకుని, అధిక సంఖ్యలో తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను గెలిపించుకోవాలని బిజెపి తహతహలాడుతోంది. మంత్రివర్గ విస్తరణ వలన జిల్లాలో అసంతృప్తుల సెగ పెద్దగా లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జివిఎంసి ఎన్నికలకు రంగం సిద్ధం చేయాలని చంద్రబాబు జిల్లా పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చినట్టు భోగట్టా. వచ్చే నెలలో విశాఖలో టిడిపి మహానాడు నిర్వహించి, వెనువెంటనే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అంటే జూలైలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం టిడిపి సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే జివిఎంసి పరిధిలో ఓటర్లను చేర్పించడం తదితర అంశాలపై దృష్టి సారించాలని టిడిపి శ్రేణులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.