విశాఖ

సాగుతారులకు పట్టాలు మంజూరు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఏప్రిల్ 3:నాలుగు దశాబ్దాలుగా అటవీ భూమిలో జీడి తోటలు పెంచుకుని జీవనం సాగిస్తున్న తమకు హక్కు పట్టాలు మంజూరు చేయాలని కోటవురట్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన సాగుదారులు విజ్ఞప్తి చేసారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో టి.జగ్గంపేట, కె. వెంకటాపురం, కైలాసపట్నం గ్రామాలకు చెం దిన అటవీ భూముల సాగుదారులు ఆర్డీవోకు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పై గ్రామాల్లోని 300 కుటుంబాల వారు సుమారు రెండువేల ఎకరాల అటవీ భూమిని సాగు చేసుకుని జీడి తోటలు పెంచుకున్నామన్నారు. సదరు భూములకు పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శివలంక కొండలరావు ఆర్డీవోకు విజ్ఞప్తి చేసారు.ఇటీవల కాలంలో అటవీ భూములను కొంత మంది తమ ఆధీనంలోకి తీసుకుని రైతులను అడ్డుకుంటున్నారని ఆయన ఫిర్యాదు చేసారు. దీనిపై స్పందించిన ఆర్డీవో సూర్యారావు పరిశీలించి సాగుదారులకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మం జూరు చేసిన భూములను సకాలంలో వినియోగించుకోవాలని ఆర్డీవో కోరారు. లేకపోతే సదరు భూములను వేరొక లబ్ధిదారులకు కేటాయిస్తామన్నారు. సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. తమకు కేటాయించిన భూమిని వేరొకరు ఆక్రమించుకున్నారని, తమకు న్యా యం చేయాలని కోరిన లబ్ధిదారులనుద్దేశించి ఆర్డీవో మాట్లాడుతూ ఏళ్ళు గడుస్తున్నా భూమిని వినియోగించుకోక పోతే దానిని వేరొకరికి కేటాయిస్తామని తెలిపారు. భూమిని పరిశీలించి ఆక్రమించిన వారిన పేరున పట్టాలు లేక పోతే చర్యలు చేడతామని వారికి స్పష్టం చేసారు. మీ కోసం కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ భూములను ఆక్రమించారని, కుటుంబంలో భూమి, ఇళ్ళ పంపకాలు సక్రమంగా జరగలేదని వివరిస్తూ తమకు న్యాయం చేయాలని కొం త మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం పరిపాలనాధికారి వి.ప్రకాష్‌రావు, మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్ర, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.