విశాఖపట్నం

అయ్యన్నకు ఆర్ అండ్ బి గంటాకు మానవ వనరుల శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 3: రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన అయ్యన్నపాత్రుడికి విస్తరణ నేపథ్యంలో ఆ శాఖను మార్చి, రోడ్లు భవనాల శాఖ బాధ్యతలను అప్పగించారు. అయితే గంటా శ్రీనివాసరావు శాఖలో మార్పు లేదు. గతంలో మాదిరి గంటా మానవ వనరుల శాఖలోనే కొనసాగుతారు. గంటా శాఖను మార్చి పోర్టులు, వౌలిక సదుపాయాల శాఖను అప్పగిస్తారని అంతా భావించారు. కానీ సిఎం చంద్రబాబు మాత్రం ఆయన శాఖను మార్చలేదు.
ఇదిలా ఉండగా మంత్రులు అయ్యన్న, గంటా మంగళవారం నగరానికి వస్తున్నారు. వీరికి స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభుత్వంలో కదలిక కోసమే
ఆత్మగౌరవ యాత్ర : గుడివాడ అమర్
గోపాలపట్నం, ఏప్రిల్ 3 : ఆత్మగౌరవ యాత్రతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక తీసుకొస్తామని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ సాధనకు వైకాపా తలపెట్టిన యాత్ర సోమవారం 66వ డివిజన్ శివారు ఎం ఇ ఎస్ పంప్‌హౌస్ నరవ ప్రాంతంలో ప్రారంభించారు. నరవ ప్రాంతం ఉండి కొత్తపాలెం మీదుగా గోపాలపట్నం పెట్రోల్ బంకుకు సాయంత్రానికి చేరుకున్నారు. ఇక్కడి పెట్రోల్ బంక్ వద్ద జరిగిన సమావేశంలో గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ విశాఖకు రైల్వే జోన్ హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. విశాఖకు రైల్వే జోన్ వస్తే చదువుకున్న స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ నియోజకవర్గం వైకాపా కన్వీనర్ డాక్టర్ మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ అందరి సహకారంతో విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ సాధ్యమవుతుందన్నారు. అనకాపల్లి నుండి భీమిలి కొనసాగే ఈ యాత్ర ఈనెల 9న ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా 66వ డివిజన్ అధ్యక్షుడు దొడ్డి కిరణ్, 68వ డివిజన్ అధ్యక్షుడు గొర్లె అప్పలస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.