విశాఖపట్నం

విశాఖ తీరంలో తారాతోరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం,(కల్చరల్), ఏప్రిల్ 8: తెలుగుచలన చిత్ర రంగంలోని అగ్రశ్రేణి తారా లోకంతో శనివారం విశాఖనగరం మరో ‘చిత్రపురి’గా మారింది. టిఎస్సార్, టివి 9 జాతీయ పురస్కారాలు 2015-16 సంవత్సరాలకుగాను అక్కయ్యపాలెంలోని పోర్ట్ క్రికెట్ స్టేడియం ఆరుబయట ప్రాంగణంలో అత్యంత కోలాహలంగా నిర్వహించారు. అన్ని దారులూ తారాతోరణం వద్దకే అన్న తీరులో వాహనాలు, ప్రజాసందోహంతో ఆ ప్రాంతమంతా కుంభమేళాను తలపించింది. ఈ అవార్డులకుగాను ప్రజల నుంచి టివి ద్వారా విజేతలను నిర్ణయించడంతో పాటు జ్యూరీ సభ్యుల ఎంపికను పరిగణలోకి తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబు, కృష్ణంరాజు వంటి అతిరథులతో పాటు, అలనాటి డ్రీమ్‌గర్ల్ హేమామాలిని, జయప్రద, నదియా, మీనా, గౌరి ముంజల్, హంసానందిని, మంజుల కుమార్తె శ్రీదేవి తదితరులు ఈ అవార్డు ఉత్సవంలో తగు ఉనికిని చాటుకున్నారు. ప్రముఖ వ్యాఖ్యాత సుమ తన వ్యాఖ్యానంతో ఆహుతులని ఆకట్టుకున్నారు. కార్యక్రమం తరువాత నగరంలోని ‘్భపణ్ బ్రదర్స్’( ఉమా భూఫణ్) సంగీత విభావరితో హోరెత్తింది. జ్యోతి, భగవతి, సుహాసిని, ఉమాభూఫణ్‌తో కలిసి నాటి నేటి సూపర్‌హిట్ గీతాలు అలరించారు. చలనచిత్ర గాయకుడు ‘సింహ స్వప్నతో కలిసి ‘్ధృవ’ తదితర చిత్ర గీతాలని గానం చేశారు. శ్రీదేవి, హంసానందిని, గౌరి మంజల్ చేసిన మెడ్లీగీత నృత్యాలు ఒకదాన్ని మించి మరోకటి రసవత్తరంగా సాగాయి. ప్రముఖ హాస్యనటుడు ఆలీ తన బృందంతో చేని నృత్య తరంగం హైలెట్‌గా నిలిచింది. సత్యమాస్టర్ నృత్య దర్శకత్వంలో సింహ, శంకర్‌దాదా ఎంబిబి ఎస్, నాన్నకు ప్రేమతో, మిర్చి వంటి చిత్ర హీరోలను అనుకరించి ఆహుతులను ఉరకలెత్తించారు. అనంతరం జరిగిన సభను టిఎస్సార్ శివ పంచాక్షరిక ఆరంభించి కళలు, కళాకారుల పక్షపాతినని కళతో ఈశ్వర కటాక్షం సిద్ధిస్తుందన్నారు. విశాఖ శారాదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తన అనుగ్రహ భూషణంతో విశాఖకు మణిపూస టిఎస్సార్ అని, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక వర్గాలవారిలో అరుదైన వ్యక్త టి ఎస్సార్‌గా అభివర్ణించారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగరంలో చిత్రప్రముఖులు నటరాజు చిడ్డలుగా నిత్యం దైవ ప్రార్థనలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు, టిఎస్సార్ కళా నిరతిని కొనియాడి సంస్కృతిక సార్వభౌమ బిరుదురావడం పట్ల అభినందనలు తెలిపారు. నాగార్జున తనకు బాలకృష్ణకు మధ్య ఎటువంటి గొడవలు లేవని, తామిద్దరం ఒకటేనన్నారు. తాను చెప్పదలిచుకున్న ప్రసంగం మోహన్‌బాబు ముందే చెప్పేశారని, అది జేబులోంచి దొంగిలించారని చమత్కరించడం విశేషం. జాకీ షరఫ్, బ్రహానందం, బప్పిల హరి, అశ్వనీదత్, డి.సురేష్‌బాబుతో పాటు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, ఎంపి ముత్తంశెట్టి సభలో పాల్గొన్నారు.