విశాఖ

ఎన్నికల సంస్కరణలకు జాతీయస్థాయిలో చంద్రబాబు ఒత్తిడి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిరూరల్, ఏప్రిల్ 10: ఎన్నికల సంస్కరణలకు జాతీయస్థాయిలో ప్రధాని నరేంద్రమోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. స్థానిక ఆయన క్యాంప్ కార్యాలయంలో సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ డబ్బుతో కూడిన ఎన్నికలు కావడంతో ఈ విషసంస్కరణ వ్యవస్థను ఎదుర్కొవలసిన సమ యం, ప్రధాని మోదీ ఇటువంటి సంస్కరణలకు ముందుంటారన్నది తమిళనాడు ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల రద్దు రుజువుపరుస్తుందన్నారు. అక్కడ ఉపఎన్నికల ఎన్నికల కమిషన్ రద్దుచేయడం మంచి పరిణామం అన్నారు. 89కోట్ల రూపాయ లు ముగ్గురు మంత్రుల సారథ్యంలో ఓటరుకు నాలుగువేలు చొప్పున పంచినట్లు ఆదాయ పన్నుశాఖ అధికారులు నిర్ధారించినందున ఉప ఎన్నికల రద్దు చేసారన్నారు. కేవ లం రద్దుచేసి మరోసారి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఆ ఎన్నికల్లో అవినీతికి పాల్పడిన పార్టీ అభ్యర్థిని అనర్హతగా ప్రకటించి తిరిగి పోటీచేయకుం డా ఉత్తర్వులు జారీచేయాలన్నారు. ఎన్నిసార్లు వాయిదావేసినా అభ్యర్థికిగాని, పార్టీకిగాని ఖర్చు ఎక్కువ అవుతుంది తప్ప విధానాల్లో మార్పురావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 2016లో కూడా తమిళనాడులో అరవకురిచి, తంజావూరు నియోజకవర్గాల్లో ఎఐడిఎం, డిఎంకె పార్టీలు రెండూ కలిసి 100కోట్లు నగదును, బ్రాందీ, బట్టలు, గిప్టుకూపన్లు ఓటర్లకు పంచడంతో మూడు పర్యాయాలు వాయిదా వేశారన్నారు. విశాఖపట్నంలో 2006లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీవారు డబ్బుపంచారని, డ్వాక్రావారి పుస్తకాలను కూడా స్వాదీనం చేసుకున్నారని దీనిపై రెహమాన్,తాను ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసామన్నారు. ఎన్నికల కమిషనర్ కెజె రావ్ స్వయం గా వచ్చి విచారణలో నిర్ధారించారన్నారు. ఈ డబ్బును సంపాదించుకునేందుకు రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికల ఖర్చును సంపాదించి రాజకీయాన్ని వ్యాపారంగా చేసి రాబడికోసం తాపత్రాయం పడుతున్నారన్నారు.దీనిని రూపుమార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంస్కరణలో ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి దాడి స్పష్టం చేసారు.
ఎమ్మెల్యే పీలా చిత్తశుద్ధి నిలబెట్టుకో...
తుమ్మపాల సుగర్స్‌పై చేసిన ప్రకటనలకు ఎమ్మెల్యే కట్టుబడి ఉండాలి
నేడు సిఎంకు రాజీనామా అందజేసి పోరుబాటకు సిద్ధం కావాలి
వైసిపి నేతల డిమాండ్
అనకాపల్లి(నెహ్రూచౌక్), ఏప్రిల్ 10:తుమ్మపాల సుగర్స్‌ను ఆధునీకరించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిఎం ఇంటి ముందు ధర్నా చేస్తానని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గతంలో చేసిన ప్రకటనను నిజం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అనకాపల్లి అసెంబ్లీ వైఎస్సాఆర్ సిపి నేతలు డిమాండ్ చేసారు. మంగళవారం అనకాపల్లికి సిఎం చంద్రబాబు రానున్న నేపధ్యంలో సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పట్టణ వైఎస్సాఆర్‌సిపి అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, పట్టణ వైఎస్సాఆర్‌సిపి యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, జిల్లా వైకాపా ప్రతినిధి మళ్ల బుల్లిబాబు తదితరులు ప్రసంగించారు. ఫ్యాక్టరీని ఆధునీకరించకపోగా మూడేళ్లక్రితం ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకుకు ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదని, వీటన్నింటి పట్ల నైతిక బాధ్యత వహి స్తూ ఎమ్మెల్యే పీలా మంగళవారం రానున్న సిఎం చంద్రబాబు రాజీనామా లేఖను అందజేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసారు. గత ప్రభుత్వ హయాంలో శారదానదిపై బ్రిడ్జీ నిర్మాణం జరిగిందని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సంపతిపురం వద్ద మెగా మంచినీటి పథకం తదితర భారీ ప్రాజెక్టులన్నీ అప్పుడే ప్రారంభమై 70శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 30శాతం పనులు తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే తామే ఆ ప్రాజెక్టులను సాధించినట్లు ఎమ్మెల్యే పీలా వారిచే ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటన్నారు. అనకాపల్లిలో కంపోస్టు యార్డు సమస్య పరిష్కారం కాలేదని, రేబాక వద్ద గృహసముదాయం అసంపూర్తిగా మిగిలిపోయిందని, ఇలా ఎక్కడి సమస్య అక్కడే పేరుకుపోయి ఉంటే 150 కోట్లతో అభివృద్ధి చేసామని చెప్పుకోవడం సిగ్గుచేటని వైకాపా నేతలు అవహేళన చేసారు. వైకాపా నేతలు పిడి గాంధీ, ఏడువాకల నారాయణరావు, వేగి త్రినాథ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.