విశాఖ

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఏప్రిల్ 10: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే రెండు పర్యాయాలు అనకాపల్లికి విచ్చేసారు. మూడో పర్యాయంగా మంగళవారం సాయంత్రం తిరిగి అనకాపల్లికి విచ్చేసి ఈ ప్రాంతంలో జరిగే వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గతంలో సిఎంగా బాబు పదేళ్లు పనిచేసారు. ఈ పర్యాయం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తుం ది. కానీ, గతంలో ఎన్నడూ లేని విధం గా అనకాపల్లికి మూడోసారి విచ్చేయడమే కాకుండా ఏసిఎం రాని విధంగా ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాద్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి, స్థానిక ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రికి రెండో పర్యాయంగా చంద్రబాబు రానుండటం మరో ప్రత్యేకతను సంతరించుకుంది. ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ నియోజకవర్గంలోను అటు ప్రభుత్వంలోను తన పట్టు సడలిపోలేదని, మరింత బలపడుతుందని నిరూపించుకునేందుకు మంగళవారం జరగనున్న చంద్రబాబు పర్యటన వేదికగా మలుచుకుని ఈ పర్యటనను మరింత దిగ్విజయం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డి కృషిచేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడి నూకాంబిక అమ్మవారి ఆలయానికి చంద్రబాబు విచ్చేస్తారు. భక్తుల విరాళాలతో తయారుచేసిన మూడు కిలోల బంగారు కిరీటాన్ని అమ్మవారికి సిఎం చంద్రబాబు సమర్పిస్తారు. అక్కడి నుండి ఇక్కడి ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకుంటారు. అదనంగా నిర్మించి మరో 150 పడకల ఆసుపత్రిని, ప్రసూతి వార్డులను సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. గతంలో ఈ ఆసుపత్రిని సందర్శించి మరలా వస్తానని, అప్పటికి ఈ ఆసుపత్రిలో జరిగే అభివృద్ధిని చూస్తానని అప్పట్లోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే పీలా సమీక్ష జరపనున్నారు. శారదానదిపై నిర్మించిన బ్రిడ్జీని స్థానిక గవరపాలెంలో వుడా నిధులతో ఆధునీకరించిన పరమేశ్వరీ పార్కును 36కోట్లతో సంపతిపురం వద్ద నిర్మించిన భారీ మంచినీటి పథకం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పథకం, పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ఇక్కడి మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభా ప్రాంగణంలో రిమోట్ కంట్రోల్ ద్వారా సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. అలాగే 3.20కోట్ల తో ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణం, తుమ్మపాల, సత్యనారాయణపురం, కశింకోట తదితర ప్రాంతాల్లో కల్యాణ మండపాల నిర్మాణంతోపాటు పలు ప్రతిష్ఠాత్మక అభివృద్ధి పనులకు సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. ఈ విధంగా 123కోట్లతో సిఎం చంద్రబాబు ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తారని ఎమ్మెల్యే పీలా గోవింద తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడి మున్సిపల్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు నియోజకవర్గ నలుమూలల నుండి అనూహ్య సంఖ్యలో ప్రజలను తరలించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్వశక్తులు ఒడ్డి కృషిచేస్తున్నారు.
లా-యూనివర్శిటీని సందర్శించిన శాసన మండలి చైర్మన్ చక్రపాణి
సబ్బవరం, ఏప్రిల్ 10:మండలంలోని అసకపల్లి పంచాయతీ పరిధిలో నిర్మించిన దామోదర సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయాన్ని శాసన మండలి చైర్మన్ చక్రపాణి సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఆయనకు స్వాగతం పలికిన యూనివర్శిటీ రిజిస్ట్రార్ సిపి దయానందమూర్తి,ఎకడమిక్ ఎఫైర్స్, అండ్ రీసెర్చి డీన్ పి.శ్రీ దేవిలు యూనివర్శిటీ క్యాంపస్‌లోని ఎకడమిక్ బ్లాక్‌లో నిర్మించిన మూడు అంతస్తుల భవన సముదాయాన్ని చూపించారు. అయితే ఇక్కడి యూనివర్శిటీ నిర్మాణాలను చూసి ముగ్థుడైన చైర్మన్ చక్రపాణి విద్యార్థుల కోసం నిర్మించిన అధునాతన గ్రంథాలయం, మూట్ కోర్టుహాల్, ఫ్యాకల్టీ సెక్షన్లు, తరగతి గదులు, విశాలమైన సమావేశ మందిరం, యూనివర్శిటీలో నిర్మించిన అధునాత క్యాంటీన్‌ను పై అంతస్తునుంచి ఏరియల్ వ్యూను తిలకించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ దయానందమూర్తిని చక్రపాణి ప్రశ్నిస్తూ మొత్తం ఎన్నిబ్లాక్‌లు నిర్మించారని అడిగారు. ఆరు బ్లాక్‌ల నిర్మాణం గురించి అందులో విద్యార్థుల హాస్టల్ భవనాలు,క్యాంటీన్,ఎకడమిక్ బ్లాక్, లైబ్రరీ, మ్యూట్‌కోర్టుల నిర్మాణల గురించి వివరిస్తూనే జాతీయ స్థాయిలో ఇటీవల నిర్వహించిన మూట్‌కోర్టు పోటీల వివరాలను వెల్లడించారు. అనంతరం చైర్మన్ చక్రపాణి ఇక్కడి విద్యార్థినులను విద్యాప్రమాణాలపై ప్రశ్నించారు. ఫ్యాకల్టీ బాగుందని వారు తెలిపారు. ఆయన వెంట అనకాపల్లి సిఐ రామచంద్రరావు,డీన్ పి.శ్రీ దేవి,గోపి తదితరులు ఉన్నారు.