విశాఖపట్నం

సిమంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 15 : సిమెంట్ మంటలు పుట్టిస్తోంది. రెండు నెలల కాలంలో 50 శాతం పెరిగిన సిమెంట్ ధరలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావానే్న చూపుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలపై సిమెంట్ ధరలు నీళ్లు జల్లుతున్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సుమారు 900 నుంచి 1000 వరకూ గృహ నిర్మాణ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది జివిఎంసి పరిధిలో నిర్మాణ అనుమతి తీసుకున్న భవన నిర్మాణాల సమాచారం. అనుమతి పొందిన భవనాలకు సంబంధించి సుమారు కోటి చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టి) నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటి వరకూ సగం నిర్మాణం పూర్తయిందని భావిస్తే ఇంకా 50 లక్షల ఎస్‌ఎఫ్‌టి నిర్మాణం పెండింగ్‌లో ఉంది. ఒక ఎస్‌ఎఫ్‌టికి 20 కిలోల సిమెంట్ అవసరం అవుతుందని నిర్మాణ సంస్థల లెక్క. దీని ప్రకారం చూస్తే ప్రస్తుతం విశాఖ పరిధిలో 50 లక్షల ఎస్‌ఎఫ్‌టి నిర్మాణానికి లక్ష టన్నుల సిమెంట్ అవసరం అవుతుంది. ప్రస్తుతం పెరిగిన ధరలను బట్టి చూస్తే సుమారు రూ.130 కోట్ల మేర భారం పడుతోంది. గృహ నిర్మాణంలో హఠాత్తుగా పెరిగిన సిమెంట్ ధరలతో నిర్మాణ సంస్థలు వినియోగదారులపై భారం వేయాలి. అయితే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాలను కాదని, కొత్తగా ఎస్‌ఎఫ్‌టి ధర పెంచితే కొనుగోలు దారు అంగీకరించే పరిస్థితి లేదు. అలాగని నిర్మాణంలో ముందుకు సాగితే గిట్టుబాటు కాని పరిస్థితి ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థలు గృహ నిర్మాణానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని నిర్ణయించే స్థితికి చేరుకుంటున్నాయి. వినియోగదారునిపై భారం పడకుండా, నిర్మాణ కంపెనీలు తాత్కాలికంగా నిర్మాణ పనులను వాయిదా వేస్తే దాని ప్రభావం అసంఘటిత రంగంపై పడే ప్రమాదం ఉంది. విశాఖలో అసంఘటిత రంగంలోని గృహ నిర్మాణ పనుల్లో సుమారు ఒక లక్ష మంది వరకూ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరంతా భవన నిర్మాణ పనులతోనే జీవనోపాధి పొందుతున్నారనడంలో సందేహం లేదు. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భవన నిర్మాణ కార్మికులు విశాఖ వలసవచ్చి పనులు చేసుకోవడం సర్వ సాధారణం. ప్రస్తుతం సిమెంట్ ధరల పెరుగుదల నేపథ్యంలో నిర్మాణ సంస్థలు నిర్మాణ పనులను నిలిపివేస్తే వీరి జీవనోపాధికి విఘాతమేర్పడే ప్రమాదం ఉంది. ఒక్క రోజు కూలికి వెళ్లకపోతే ఇంట్లో పస్తులు తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థలు తీసుకునే కీలక నిర్ణయంపైనే వీరి భవిష్యత్ ఆధారపడి ఉంది. నిర్మాణ రంగం నిలిచిపోయి, కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడితే అది పాలనావైఫల్యంగా భావించే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో ఒకటి రెండు సిమెంట్ కంపెనీల గుత్త్ధాపత్యానికి తలవంచి ప్రభుత్వం అతిపెద్ద ఓట్ బ్యాంకు అసంఘటిత రంగ కార్మికులను వదులుకుంటుందా అన్నది శేష ప్రశ్న.
తక్షణం సిమెంట్ ధరలు తగ్గించాలి : క్రెడాయ్
పెరుగుతున్న సిమెంట్ ధరలను ప్రభుత్వం తక్షణమే నియంత్రించాలి. సిమెంట్ పరిశ్రమలో గుత్త్ధాపత్యం చెలాయిస్తున్న కొన్ని కంపెనీలు స్వలాభంతో వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచేందుకు వ్యూహాత్మకంగా సిమెంట్ ధరలను పెంచుతున్నాయి. ఇది పరోక్షంగా సామాన్యునిపై తీవ్ర ప్రభావానే్న చూపుతోంది. సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చించి ధరలను నియంత్రించని పక్షంలో తాము నిర్మాణాలు నిలిపివేయడం ఖాయం. ఇదే జరిగితే లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడతారు. అప్పుడు జరిగే విపరీత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని శనివారం క్రెడాయ్ విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చర్చించినట్టు అధ్యక్షుడు కోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో వచ్చే వారం తరువాత నిర్మాణాలను నిలిపివేస్తామని పేర్కొన్నారు.