విశాఖ

19న ఐటిడిఎ పాలకవర్గ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఏప్రిల్ 16: పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఎ.) పాలకవర్గ సమావేశాన్ని ఈ నెల 19వ తేది బుధవారం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పాలకవర్గ సమావేశ నిర్వహణకు ఐ.టి.డి.ఎ. అధికార యంత్రాంగం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ఐ.టి.డి.ఎ. చైర్మన్‌గా వ్యవహరించే కలెక్టర్ అధ్యక్షతన ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన ఐ.టి.డి.ఎ. పాలకవర్గ సమావేశం దాదాపు సంవత్సరం కాలం తరువాత ఎట్టకేలకు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. గిరిజనాభివృద్ధిలో కీలక భూమికను పోషించే పాలకవర్గ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహించా ల్సి ఉన్నా పలు రాజకీయ కారణాలు ఈ సమావేశంపై తీవ్ర ప్రభావం చూపి స్తూ నిర్ణీత వ్యవధిలో జరిగిన దాఖలా లు అతి స్వల్పమనే చెప్పాలి. ఐ.టి.డి.ఎ. ను ఏర్పాటు చేసిన నాలుగు దశాబ్దాల చరిత్రలో మూడు నెలలకు ఒకసారి పాలకవర్గాన్ని సమావేశాన్ని నిర్వహించిన దాఖలాలు నామమాత్రంగానే చెప్పవచ్చు. దాదాపు రెండు సంవత్సరాల వరకు కూడా ఐ.టి.డి.ఎ. పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించని సందర్భాలు కోకల్లలుగా ఉండగా ఈ సమావేశాల నిర్వహణ తీరుపై ప్రజాప్రతినిధులు దుమ్మెత్తిపోసిన దాఖలాలు కూడా అంతేవిధంగా ఉన్నాయనే చెప్పాలి. గిరిజన ప్రాంత అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ఐ.టి.డి.ఎ. పాలకవర్గ సమావేశాన్ని నెలలు, సంవత్సరాల తరబడి నిర్వహించకుండాకాలయాపన చేస్తున్న పాలకుల తీరుపై గతంలో పార్లమెంట్, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. అయితే గత కలెక్టర్ యువరాజు, ఐ.టి. డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్ మాత్రం పాలకవర్గ సమావేశ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒకసారి ఈ సమావేశాన్ని నిర్వహించేవారు. కలెక్టర్‌గా యువరాజు, ప్రాజెక్టు అధికారిగా హరినారాయణన్ పనిచేసిన కాలంలో ఐ.టి.డి.ఎ. పాలకవర్గ సమావేశ నిర్వహణలో ఎటువంటి జాప్యం లేకుండా క్రమం తప్పకుండా దీనిని నిర్వహించి ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత వాసుల మన్ననలను చూరగొన్నారనే చెప్పాలి. అయితే యువరాజు, హరినారాయణన్ ఒకేసారి బదిలీపై వెళ్లిపోవడంతో అప్పటి నుంచి పాలకవర్గ సమావేశ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం కలెక్టర్, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఇటీవల పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు ముందుకువచ్చినప్పటికీ పార్లమెంట్ సమావేశాల కారణంగా మళ్లీ దీనిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఐటిడిఎ పాలకవర్గంలో పార్లమెంట్, శాసన, శాసనమండలి సభ్యులు సభ్యులుగా ఉండడంతో వీరి ప్రమేయం లేకుండా దీనిని నిర్వహించే అవకాశం లేకపోవడంతో వాయిదా వేయకతప్పలేదు. అయితే ప్రస్తుతం పార్లమెంట్, శాసనసభ సమావేశాలు ముగిసిపోవడంతో ఐటిడిఎ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 19వ తేదిన జరిగే పాలకవర్గ సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.